ఎప్పుడో చేసిన చిన్న తప్పునకు జీవితాంతం మూల్యం చెల్లించుకోవడం ఎంతవరకు సమంజసం? ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు మధ్యలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి వీధిన పడేయం మానవత్వం అనిపించుకుంటుందా? నటి పూనమ్ కౌర్ విషయంలో జరుగుతున్నది ఇదే. పవన్ కళ్యాణ్ కూ, పూనమ్ కూ మధ్య ఏం జరిగిందన్నది మనకు అప్రస్తుతం. గతాన్ని తరచూ తవ్వి తీస్తూ మానసిక క్షోభకు గురిచేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది. అలాంటి మానసిక క్షోభను పూనమ్ కౌర్ అనుభవిస్తున్నట్లు అర్థమవుతోంది.
మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలిస్తే తన సమస్యలు చెప్పుకుంటానంటూ ఆమె ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. అలాగే దర్శకుడు దాసరి నారాయాణరావు గురించి కూడా ఆమె ఓ ట్వీట్ చేసింది. ఆయనను గురువుగా సంబోధించింది. అంతేకాదు ‘రౌడీదర్భార్’ చిత్రంలోని ‘ఇంద్రలోకం పార్టీ.. చంద్రలోకం పార్టీ.. మీ జెండాలకు వేల వేల దండాలయా.. మీ పార్టీల్లో గూండాలను చేర్చకండయా’ అనే వీడియో సాంగ్ ను పోస్ట్ చేసి దయచేసి ఈ పాటను వినమంటూ కోరింది. దీని వెనక ఆమె ఉద్ధేశం ఏమిటన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు.
ఆ విషయాన్ని అలా ఉంచితే పవన్ మీద పోసాని కృష్ణమురళి కోపం ఉంటే ఆయనపైనే కామెంట్లు చేసి ఉంటే బాగుండేది మధ్యలో పూనమ్ ను లాగడం ఎందుకు? ప్రేమ పేరుతో పంజాబీ అమ్మాయిని మోసం చేసి ఎవరికీ తెలియకుండా అబార్షన్ చేయించి ఐదు కోట్ల రూపాయలతో మ్యాటర్ సెటిల్ చేశారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అందరూ మరిచపోయిన అంశాన్ని ఇలా తిరగదోడడం పవన్ ను అభాసుపాలు చేయడనికే అన్నది తెలియంది కాదు. గతంలో కూడా కత్తి మహేష్ కూడా పూనమ్ పై ఇదే రకమైన ఆరోపణలతో ఆమెను వీధిలోకి లాగారు. ఇలా ప్రతి ఒక్కరూ సమయం వచ్చినప్పుడల్లా ఆమెను వీధిలోకి లాగుతున్నారు.
ఆమె ఫోన్ రికార్డింగులతో వీడియోలను యూట్యూబ్ లో వదులుతున్నారు. పవన్ విషయంలో ఆమె ఏం మాట్లాడిందో ఆ వాయిస్ రికార్డింగు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘నేను తప్పుపని చేయలేదు. నన్ను లంజముండ అని తిడుతున్నారు. నేను ఈరోజు వరకూ ఏ హీరోతోనూ తిరగలేదు, ఏ ప్రొడ్యూసర్ తోనూ తిరగలేదు. నేను తప్పు పనులు చేయలేదు. నేను ఎలాంటి అమ్మాయినో మీకు తెలియదా? ఈ మనిషి బయటికి రాడని నేను ట్వీట్లు పెట్టి డిలిట్ చేసేశాను. ఫైవ్ స్టార్ హోటల్ లో కూర్చుని మీటింగులు పెట్టడం వేరు.. ప్రాక్టికల్ గా వేరు. పక్కనోళ్లు చెడగొడితే ఒక మనిషికి బుద్ధుండాలి.
బుద్ధుండుంటే ఆయన జీవితం ఇలా సర్వనాశనం అయి ఉండేది కాదు. తిరిగే అమ్మాయిలు ఎలా ఉంటారో ఇంటి అమ్మాయిలు ఎలా ఉంటారో మీకు తెలియదా? ఇన్సల్ట్ అవుతున్నా నోరుమూసుకుని ఇంట్లో కూర్చుని ఉమన్ ఎంపవర్ మెంట్ గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం. ఒక అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోతే మీరు చూస్తూనే ఉన్నారు. రేణుదేశాయ్ ను ఆయనతో కలపాలనుకున్నాను. నేనైతే డబ్బుల కోసమో, మూవీ కోసమో ఆయన దగ్గరకు వెళ్లలేదు’ ఇలా సాగిపోయింది ఆమె వాయిస్. ఇల రకరకాల జిమ్మిక్కులతో పూనమ్ ను బద్నామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Must Read ;- పీకే వర్సెస్ పోసాని.. హద్దులు దాటేసింది











