నటుడు చంద్రమోహన్ మరణించారంటూ వదంతులు వ్యాపించాయి. ఇటీవలే ఆయన నటుడిగా తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. వయసు 80 సంవత్సరాలు. సొంతూరు కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామం. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, వదంతులను నమ్మవద్దని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 1966లో రంగులరాట్నం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు.. అప్పటినుండి సహ నాయకుడిగా, హీరోగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.

ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ జనాన్ని మెప్పించారు. ప్రముఖ హీరోయిన్లు ఎంతో మందితో నటించారు. పైగా ఆయనతో నటిస్తే అదృష్టంగా హీరోయిన్లు భావించేవారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తోనే నటించారు. తరువాత వారు అగ్రస్థాయికి చేరారు. ఆయన క్షేమంగానే ఉన్నారు కాబట్టి ఆయన మరణించారంటూ వచ్చే వదంతులను నమ్మవలసిన అవసరం లేదు. కాకపోతే గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు మాత్రం సమాచారం ఉంది.
55 ఏళ్ళు నటించానని, రాఖీ సినిమా షూటింగ్లో గుండెనొప్పి రావడంతో బైపాస్ సర్జరీ జరిగిందని, దువ్వాడ జగన్నాధం షూటింగ్ లో కూడా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడ్డానని ఆయన ఇటీవల అధికారికంగానే వెల్లడించారు. మే 23వ తేదీ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాను రిటైరవుతున్నట్లు ప్రకటించారు. తన మీద వచ్చిన పుకార్లకు చెక్ పెట్టేందుకు ఆయన భార్యతో కలిసి ఉన్న ఫొటోను కూడా మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని మణికొండలో నివాసం ఉంటున్నట్టు తెలిసింది.
Must Read ;- ‘మైనే ప్యార్ కియా’ పాటల స్వరకర్త ఇకలేరు











