గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామంలో అరాచకం చోటు చేసుకుంది. తన కూతురును ప్రేమిస్తున్నాడంటూ ఓ బాలిక తండ్రి వెంకటేష్ అనే యువకుడి కాళ్లూ, చేతులూ నరికేశాడు. పోలీసులకు విషయం తెలిసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే వెంకటేష్ ప్రాణాలు కోల్పోయాడు. కొప్పురావూరు గ్రామంలో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికను వెంకటేష్ గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడని, అమ్మాయి తండ్రి మందలించినా ఫోన్లో నిత్యం బాలికతో మాట్లాడుతున్నాడని కక్షకేసు నమోదు పెంచుకున్నాడు. బాలిక తండ్రి నిన్న రాత్రి వెంకటేష్‌ను మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మరో ఐదుగురితో కలసి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి కాళ్లు, చేతులు నరికేశారు. విషయం పోలీసులకు తెలియడంతో వెంకటేష్‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేష్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Must Read ;- విశాఖ కేజీహెచ్లో బెడ్ దొరక్క అంబులెన్స్ లోనే చిన్నారి మృతి