సమయం చాలా విచిత్రమైనంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌కు ఈ సూత్రం స్పష్టంగా వర్తిస్తుంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లను పార్ట్ టైం రాజకీయ నాయకులు అంటూ జగన్ ఎగతాళి చేసేవారు. చంద్రబాబు, పవన్ హైదరాబాద్‌లో ఉంటారు. అప్పుడప్పుడు మాత్రమే ఏపీకి వస్తారని విమర్శలు చేసేవారు.
కానీ, ఇప్పుడు ఈ సీన్ రివర్స్ అయింది. భూమి గుండ్రంగా ఉంటుందన్నట్లు..ఇప్పుడు జగన్ పార్ట్ టైం పొలిటిషియన్‌గా మారిపోయాడు. అవసరం ఉంటే తప్ప బెంగళూరు నుంచి ఏపీకి రావడం లేదు. జగన్ ఇప్పుడు పూర్తిగా బెంగళూరు ప్యాలెస్‌కు పరిమితమయ్యారు. వినాయక చతుర్థి సందర్భంగా జగన్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వినాయక చతుర్థి పూజల్లో జగన్ పాల్గొన్నారు. ఉదయం పూజా కార్యక్రమాలు ముగించుకుని జగన్ వెంటనే బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లిపోయారు. హిందూ వ్యతిరేకిగా తనపై ఉన్న ముద్రను తొలగించుకునేందుకే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
గతంలో ఇదే పాయింట్ తీసుకుని చంద్రబాబు, పవన్‌లను టార్గెట్ చేసేవారు జగన్. కానీ యాధృచ్ఛికంగా జగన్ కూడా ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బెంగళూరుకు షిఫ్ట్ అయిపోయారు జగన్. అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అడపాదడపా ఏపీకి రావడం, ఏవో రెండు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జగన్‌కు అలవాటుగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గడిచిన ఏడాదిన్నర కాలంలో బెంగళూరు, ఏపీ మధ్య 39 ట్రిప్పులు వేశారు జగన్..అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు











