పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంకాబోతోంది. ప్రభాస్ కు జోడిగా దీపిక పదుకొనే నటిస్తోంది. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఆయన గెస్ట్ రోల్ లో నటిస్తున్నారని అందరూ అనుకున్నారు కాని బిగ్ బి సినిమా మొత్తం కనపడనున్నారని సమాచారం. ఇందులోని ఆయన పాత్ర చాలా కీలకమైందని తెలుస్తోంది. ఇందుకోసం అమితాబ్ కు భారీ రెమ్యునరేషన్ అఫర్ చేశారు నిర్మాతలు.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అమితాబ్ కు 21కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్. ఇప్పటికే సినిమాకు ఓకే చెప్పిన అమితాబ్ త్వరలోనే జరుగనున్న ఫోటో షూట్ కు హాజరవుతారని తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో నటించే విలన్ కోసం అరవింద్ స్వామిని ఎంపిక చేయబోతున్నారట. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఆ షూటింగ్ కంప్లిట్ అవుతుంది. అప్పటి నుండి ప్రభాస్ సినిమాకు సంబంధించిన పనులను మొదలుపెడతాడని అంటున్నారు. ప్రభాస్ కూడా ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే హైదరాబాద్ లో ఆఖరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు రాధాకృష్ణ.
ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ‘రాధే శ్యామ్’ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేయనున్నాడు ప్రభాస్. ఇందులో తను రాముడి పాత్రలో కనపడనున్నాడు. భారీ వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మించనున్నారు నిర్మాత అశ్వనీ దత్.
Must Read ;- వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలుకానున్న రెబల్ స్టార్ ఫాంటసీ మూవీ











