ప్రభాస్ చేయబోతున్న పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’ కు సంబంధించి తాజా అప్ డేట్ వచ్చింది. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చిత్ర యూనిట్ అప్డేట్ చేస్తారని అభిమానులు ఎదురు చూశారు. కాని ఆ రోజు కూడా ఎటువంటి అప్డేట్ రాలేదు. ఈ రోజు ఉదయం 7.11 గంటలకు ఈ అప్ డేట్ వచ్చింది. షూటింగ్ ప్రారంభం కాకుండానే విడుదల తేదీ ప్రకటించడం విశేషం.
2022 ఆగస్టు 11న ఈ సినిమా విడుదలవుతుందట. త్రీడీలో రూపొందే ఈ బహుబాషా చిత్రాన్ని టీ సిరీస్ నిర్మిస్తోంది. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రారంభం ఎప్పుడు? విడుదల ఎప్పుడు అనే విషయాలను అధికారికంగా ప్రకటించేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ దీపావళికి ‘ఆదిపురుష్’ టీం సాలిడ్ అప్డేట్ తో వస్తోందని బాలీవుడ్ లో గుసగుసలు వినపించాయి. అయినా చడీ చప్పుడు లేదు. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారన్నదానిపై స్ఫష్టత వచ్చేసింది.
విడుదల తేదీ కూడా ప్రకటించేశారు.?, ఇందులో హీరోయిన్ ఎవరు ?, ఇతర పాత్రలను ఎవరు పోషిస్తున్నారు? లాంటి అంశాలు తెలియాల్సి ఉంది. ‘ఆదిపురుష్’ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిపై ఇప్పుడు కొంత స్పష్టత వచ్చేసింది. చెడుపై మంచి సాధించే విజయంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. దర్శకుడు ఓంరౌత్ తోపాటు ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ లు కూడా దీని నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు.
Must Read ;- ప్రభాస్ : మరో బాహుబలికి రెడీ!











