దగ్గుబాటి రానా నటిస్తున్న చిత్రాల్లో ఒకటి విరాటపర్వం. నీది నాది ఒకే కథ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. శ్రీవిష్ణుతో నీది నాది ఒకే కథ సినిమాని తెరకెక్కించిన వేణు ఉడుగుల రానాతో విరాటపర్వం సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ అయ్యింది. కారణం ఏంటంటే.. సురేష్ బాబును మెప్పించడం మామూలు విషయం కాదు.

కథ గురించి ఎంత చెప్పినా.. ఇంకా ఏదో కావాలి.. ఇంకా ఏదో మిస్ అయ్యింది అంటారు తప్పా.. సంతృప్తి చెందరు. అందుచేత వేణు ఉడుగుల సురేష్ బాబును ఎలా ఒప్పించారనుకున్నారు. ఇక కథ విషయానికి వస్తే.. ఇది రెగ్యులర్ స్టోరీ కాదు. నక్సలిజం, ప్రేమ మధ్య సాగే కథ. ఇందులో ప్రియమణి, సాయిపల్లవి నటిస్తున్నారు. కరోనా ముందు చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసారు. రానా షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. అయితే.. ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా జాయిన్ అయ్యింది.
ఆమె ఎవరో కాదు నివేథా పేతురాజ్. ఇందులో కీలక పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు. ఈరోజు నుంచే నివేథా పేతురాజ్ షూటింగ్ లో జాయిన్ అవుతున్నారని అఫిసియల్ గా ప్రకటించారు. ప్రియమణి, సాయిపల్లవి, నివేథా పేతురాజ్ లతో పాటు నందితాదాస్, జరీనా వాహబ్ కూడా నటిస్తున్నారు. ఇంత మంది కథానాయికలు ఇందులో నటిస్తుండడంతో ఇది కథానాయికల ప్రాథాన్యత ఉన్న సినిమా అని తెలుస్తుంది. మరి.. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న విరాటపర్వం ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Must Read ;- పౌరాణిక చిత్రం పై రానా ఆసక్తి ఎంతమాత్రం తగ్గలేదట!
The alluring @Nivetha_Tweets plays a crucial role in #ViraataParvam. She joins the shoot in Hyderabad.@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm @dancinemaniac @priyamani6 @Naveenc212 @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/2K1q7p15oo
— BA Raju's Team (@baraju_SuperHit) December 11, 2020











