గబ్బా టెస్ట్ లో టీమిండియా రెచ్చిపోయింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీ సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంత్ (89), సుందర్(22) చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టారు.
గబ్బాలో చివరిరోజు ఆటను నాలుగు పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో టీమిండియా ప్రారంభించింది. భారత్ కు రోహిత్ శర్మ ఔట్ ద్వారా ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరవాత క్రిజ్‌లోకి వచ్చిన పుజారా, మరో ఓపెనర్ శుభమన్ గిల్‌తో ఇన్సింగ్స్‌కు తిరుగులేని భాగస్వాన్ని నెలకొల్పారు. గిల్ 91 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. పుజారా సైతం బాధ్యతగా ఆడి 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రహానే 24 పరుగులతో వెంటనే పెవిలియన్ బాట పట్టడంతో టీమిండియాలో మరోసారి నిరాశ కనిపించింది. అయితే.. గెలుపుపై మాత్రం ధీమా సజీవంగానే ఉంది.
యువ సంచలనం రిషభ్ పంత్ సూపర్భ్ ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయ తీర్థాలకు చేర్చాడు. పంత్ 134 బంతుల్లో 89 పరుగులు చేసిన కీలక సమయంలో వెనుదిరిగాడు. చివరిలో వాషింగ్టన్ సుందర్ 25 మెరుపు ఇన్సింగ్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Mustb Read ;- భళా భారత్.. ఆసీస్ విజయగర్వం మట్టికరచిన వేళ!
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 369 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : 336 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 294 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ : 329/7











