ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఇప్పుడు ఒక వార్త జోరుగా షికారు చేస్తోంది. ‘ఎఫ్ 3′ సినిమాలో సాయిధరమ్ తేజ్ కూడా నటించనున్నాడనేది ఆ ప్రచారంలో సారాంశం. ‘ఎఫ్ 2’ సినిమాకి సీక్వెల్ గా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు. ఆయుధాలన్నీ దగ్గర పెట్టుకుని ఆయనరెడీగా కూర్చున్నాడు. ‘నారప్ప‘ పూర్తిచేసి వెంకటేశ్ రాగానే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక వరుణ్ తేజ్ మాత్రం ఒక వైపున కిరణ్ కొర్రపాటి సినిమాను చేస్తూనే, మరో వైపున ‘ఎఫ్ 3’ సెట్స్ ను పలకరించనున్నాడు.
ఈ నేపథ్యంలోనే సాయిధరమ్ తేజ్ గురించిన వార్త తెరపైకి వచ్చింది. ఒక ప్రత్యేకమైన పాత్రలో ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడని అంటున్నారు. ప్రతి చిన్న విషయానికి అయోమయంలో పడిపోయే ఈ పాత్రలో ఆయన తెగ నవ్వులు పూయిస్తాడని అంటున్నారు. ఈ పాత్ర సాయిధరమ్ తేజ్ చేస్తే బాగుంటుందని భావించిన అనిల్ రావిపూడి ఆయనకి కాల్ చేసి చెబితే, వెంటనే ఓకే చెప్పేశాడట. ‘సుప్రీమ్’ సినిమా నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అందువల్లనే సాయిధరమ్ తేజ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.
రీసెంట్ గా సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించినస్థాయిలో ఆడలేదు. అంతకుముందు ఆయన చేసిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా మాదిరిగానే యావరేజ్ అనిపించుకుంది. ఈ సినిమా తరువాత ఆయన దేవ కట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. ఆ సినిమా కాస్త లేటైనా ‘ఎఫ్ 3‘తో ఒకసారి ప్రేక్షకుల మధ్యకి వచ్చినట్టుగా ఉంటుందని చెప్పేసి తేజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మరికొందరు అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది తెలియదుగానీ, వినడానికైతే బాగుంది. తెరపై ఇద్దరు మెగా హీరోలు కలిసి కనిపిస్తే నిజంగానే బాగుంటుంది.
Must Read ;- నవ్వులలో మరింతగా ముంచెత్తే ఎఫ్ 3