‘బిగ్ బాస్ 4’ విన్నర్ అభిజిత్, సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ వీరిద్దరూ మంచి స్నేహితులు. అభిజిత్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ చిన్న పాత్ర పోషించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్ షిప్ తోనే విజయ్ దేవరకొండ బిగ్ బాస్ ఫైనల్ లో అభిజిత్ కి సోషల్ మీడియా ద్వారా మద్దతు ప్రకటించాడు. తన స్నేహితుడు విజయ్ కి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదని అభిజిత్ ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. వరుస ఇంటర్ వ్యూలో ఫుల్ బిజీగా ఉన్న అభిజిత్ విజయ్ ఇంట్లో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నారు.
విజయ్ తో అభిజిత్ కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫుల్ చిల్ అంటూ కామెంట్ కూడా చేసాడు. ఈ పార్టీలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో నటించిన సుధాకర్ కోమాకుల కూడా జాయిన్ అయ్యారు. అలాగే విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అండ్ ఫ్రెండ్స్ తో పాటు విజయ్ దేవరకొండ మదర్ కూడా జాయిన్ అయ్యారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీ 2012లో రిలీజైంది. ఆ సినిమాలో నటించిన అభిజిత్, విజయ్ దేవరకొండ, సుధాకర్ కోమాకుల ఇలా కలుసుకొని పార్టీ చేసుకున్నారు.
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అభిజిత్, సుధాకర్ కోమాకుల, కౌశిక్ దర్బా, శఘున్ కౌర్, జరాషా లీడ్ రోల్ చేసారు. విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి కూడా ఈ సినిమా ద్వారానే పరిచయం కావడం విశేషం.
Must Read ;- విజయ్ దేవరకొండకి ఒక థ్యాంక్స్ సరిపోదు: బిగ్ బాస్ 4 విజేత అభిజిత్











