మాస్ మహారాజా రవితేజ ఇటీవల క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా మాస్ మూవీగా సంక్రాంతి కానుకగా రిలీజైన క్రాక్ విశేషంగా ఆకట్టుకుంది. మలినేని గోపీచంద్ తెరకెక్కించిన క్రాక్ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 50 కోట్లు క్లబ్ లో క్రాక్ నిలవడం విశేషం. రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ జరుపపుకుంటుంది.
క్రాక్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో విజయోత్సాహంతో ఖిలాడి సినిమా చేస్తున్నారు. ఆన్ సెట్ నుంచి మాస్ రాజా షేర్ చేసిన ఓ ఫోటో నెట్ లో వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే.. జనవరి 26న రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఖిలాడి సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీ టీజర్ ను జనవరి 26న ఉదయం 10.08 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.
ఖిలాడి ప్లే స్మార్ట్ … టీజర్ రిలీజ్ చేయనున్నట్టు తెలియచేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో..రవితేజ నడుస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ.. పచ్చనోట్లు కనిపించడం ఆసక్తని కలిగిస్తోంది. ఈ పోస్టర్ ను బట్టి డబ్బును శాసిస్తూ.. డబ్బే జీవితంగా భావించే ఖిలాడి కథ ఇది అని తెలుస్తుంది. అంతే కాకుండా.. పోస్టర్ తోనే ఆకట్టుకున్న ఖిలాడి టీజర్ తో సినిమాతో కూడా మెప్పిస్తాడనిపిస్తుంది. సమ్మర్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. క్రాక్ తో ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఖిలాడితో కూడా విజయం సాధిస్తారేమో చూడాలి.
Must Read ;- ‘క్రాక్’ సూపర్ .. రవితేజ యాక్షన్ అదుర్స్ అంటున్న చరణ్
The Wait is going to end!
Get ready for Double – Action treat from @RaviTeja_offlFirst #GlimpseOfKhiladi will be arrived on Jan26th 10::08AM @DimpleHayathi @Meenachau6 @DirRameshVarma @ThisIsDSP @idhavish #KoneruSatyanarayana #AStudiosLLP @PenMovies #Khiladi pic.twitter.com/1imLs7gZaJ
— BARaju (@baraju_SuperHit) January 23, 2021