అనుఇమ్మాన్యుయేల్ ఎందుకనో ఒక్కసారిగా వెనకబడి పోయింది. బహుశా ఆమెకు సక్సెస్ లు రాకపోవడం కూడా ఒక కారణమనుకుంటాను. త్వరలో మహాసముద్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఆమె తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసిన ఓ హాట్ ఫొటో మాత్రం తెగ వైరల్ అవుతోంది. అను కూడా మలయాళ కుట్టినే. మొదటిసారిగా మలయాళ సినిమా తోనే సినిమా రంగానికి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలే దక్కాయి.
పవర్ స్టార్ తోనూ నటించే అవకాశం వచ్చింది. అయినా ఆమెను అదృష్టం మాత్రం వరించడం లేదు. 2016లో నాని హీరో నటించిన మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తమిళంలో మాత్రం విశాల్ నటించే అవకాశం వచ్చింది. అల్లు అర్జున్, గోపీచంద్, శివకార్తికేయన్ లాంటి హీరోల సరసన కూడా చోటు దక్కింది. అందం, అభినయం ఉన్నా సినిమాల సక్సెస్ లేకపోవడం వల్లనేమోగాని రేసు ఈ భామ వెనకబడి పోయింది. ప్రస్తుతం శర్వానంద్ తో ‘మహాసముద్రం’, అల్లు శిరీష్ తో ‘ప్రేమ కాదంట’ చిత్రాల్లో నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే తప్ప మనం ముందుకు వెళ్లలేం అన్న భావన అనుఇమ్మాన్యుయేల్ వచ్చినట్టుంది. సెక్సీ డ్రెస్, సెక్సీలుక్ తో కుర్రకారు మనసు దోచే ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటో మాత్రం నెటిజన్ల మనసు దోచుకుంది. ఇలా ఫొటోలు పెట్టి వైరల్ చేసుకోవడం, సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడం నేటి తరం హీరోయిన్లు చేసి తీరాల్సిందే. లేకుంటే ఈ పోటీలో వెనుకబడి పోవడం మాత్రం ఖాయం. ఇన్ని సినిమాల్లో నటించినా ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం రాలేదు. అందుకే హాట్ భామగా అవతారం దాల్చి ఇలా ముందుకు దూకుతోంది అనుకోవాలి.
Must Read ;- లేటు వయసులో ‘బద్రి’ భామ అందాల వడ్డన