అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక నిధి అగర్వాల్. తొలి సినిమాతో సక్సస్ సాధించకపోయినా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకుంది. ఆతర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ మజ్ను ఆశించిన స్ధాయిలో సక్సస్ సాధించకపోయినా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
ఆతర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో నటించింది. తొలి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళంలోను సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు లక్కీ ఛాన్స్ సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుందట.
ఇంతకీ ఏ సినిమాలో అంటే.. క్రిష్ తెరకెక్కిస్తోన్న భారీ పిరియాడిక్ మూవీలో అని తెలిసింది. సీనియర్ ప్రొడ్యూస్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో పవన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుంది. మరో కథానాయికగా నిధి అగర్వాల్ నటించనుందట. నిధి అగర్వాల్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని కూడా టాక్ వినిపిస్తుంది. ప్రచారంలో ఉన్న ఈ వార్తలు నిజమో కాదో తెలియాల్సివుంది. ఇదే కనుక నిజమైతే.. నిధి లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.
Must Read ;- పవన్ రానా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?