ప్రభాస్ నుంచి దాదాపు ఒక ఐదేళ్లపాటు పాన్ ఇండియా సినిమాలే రానున్నాయి. కథాకథనాల పరంగా.. తారాగణం పరంగా.. బడ్జెట్ పరంగా ఈ సినిమాలన్నీ భారీతనాన్ని సంతరించుకున్నవే. ఆ జాబితాలో ముందుగా ‘రాధేశ్యామ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే అలరించనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టైలిష్ లుక్ లో ప్రభాస్ కనిపించనున్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు.
ఆ తరువాత ప్రాజెక్టుగా ప్రభాస్ .. ‘సలార్’ సినిమా చేస్తున్నాడు. ‘కేజీఎఫ్‘ ద్వారా తన సత్తా చాటుకున్న ప్రశాంత్ నీల్, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రఫ్ లుక్ తో కనిపించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. గోదావరిఖనిలోని బొగ్గు గనుల్లో ప్రభాస్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంతటి భారీ చిత్రం షూటింగు తెలంగాణలో మొదలుకావడం పట్ల ప్రభాస్ అభిమానులందరూ ఫిదా అవుతున్నారు.
ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కి సంబంధించిన సన్నాహాలు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈ నెల 22వ తేదీ నుంచి రెండో షెడ్యూల్ మొదలుకానుంది. హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగుకి సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ కథానాయికగా అలరించనుంది. ఈ పాన్ ఇండియా మూవీ హిట్ అయితే మళ్లీ ఓ దశ అందుకుంటుందనే ఆశతో ఆమె ఉంది. ‘సలార్‘ ఆమె కెరియర్ ను ఏం చేస్తాడో చూడాలి మరి.
Must Read ;- ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్ లీకులు