కన్నడలో రూపొందిన కిరిక్ పార్టీ సినిమాలో రక్షిత్ శెట్టి, రష్మిక జంటగా నటించారు. ఆ సినిమా విజయం సాధించింది. అక్కడ ఏర్పడిన వీరి స్నేహం ప్రేమగా మారింది. అనతికాలంలోనే వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. అయితే.. ఆతర్వాత రష్మిక టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆతర్వాత గీత గోవిందం, దేవదాస్,.. ఇలా వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది.
ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తుంది. ఇంకా చెప్పాలంటే… స్టార్ట్ టైమ్ లోనే స్టార్ హీరోయిన్.. క్రేజీ హీరోయిన్ అయ్యింది. అయితే… టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వడంతో ఆమె ఆలోచనలో మార్పు వచ్చిందో.. లేక వేరే కారణాలు ఉన్నాయో తెలియదు కానీ.. ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకుని రక్షిత్ శెట్టికి షాక్ ఇచ్చింది. దీంతో రష్మిక పేరు మారుమ్రోగుతుంది కానీ.. రక్షిత్ శెట్టి పేరు మరచిపోయారు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత.. ఈ అమ్మడు ట్విట్టర్ లో రక్షిత్ శెట్టికి టచ్ లోకి వెళ్లింది.
ఇంతకీ విషయం ఏంటంటే… మొదటి సారిగా రష్మిక, రక్షిత్ శెట్టి కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ ‘కిరిక్ పార్టీ’ కన్నడ మూవీ లోని ‘బెలగెద్దు…’ అనే సాంగ్100 మిలియన్ వ్యూస్ సాధించిందట. ఈ విషయాన్ని చెబుతూ ట్విట్ చేసింది. ఇందులో రక్షిత్ శెట్టిని కూడా ట్యాగ్ చేయడం విశేషం. ఈ పాట చిత్రీకరణ సమయంలో జరిగినవి గుర్తు చేసుకుంటూ ఇలా ట్విట్టర్ లో స్పందించడం ఆసక్తిగా మారింది. రష్మిక ఇలా తన మాజీ ప్రియుడుకి టచ్ లోకి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. ఏమో.. మాజీ ప్రియుడు పై మనసు మళ్లిందేమో అని నెటిజన్లు కొంత మంది కామెంట్లు పెడుతున్నారు. మరి.. రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.
Must Read ;- రష్మికా మందన్న బాలీవుడ్ ఎంట్రీ..!
Belageddu – My first ever song.. Which I absolutely adore reached 100M.. 🤗🤍 I remember making this song mine.. Living through those montages.. And just finding Saanvi in me..✨
Ahh.. The journey.💃🏻✨@shetty_rishab @rakshitshetty @SamyukthaHegde @AJANEESHB @ParamvahStudios— Rashmika Mandanna (@iamRashmika) December 24, 2020