బాలీవుడ్ లో ఇప్పుడు ఆలియా భట్ హవా నడుస్తోంది. పిల్ల పొట్టిగా ఉన్నా ఆమె రెమ్యూనరేషన్ మాత్రం గట్టిగానే డిమాండు చేస్తుందట. బాలీవుడ్ లో ఆమె ఒక సినిమాకు దాదాపు రూ. 10 కోట్లు తీసుకుంటుందని సమాచారం. పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ లో ఆలియా భట్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. ఇందులో సీత పాత్రను ఆమె పోషిస్తోంది. దీనికి ఆమె తీసుకున్న పారితోషికం అక్షరాలా 12 కోట్లు అన్న మాట వినిపిస్తోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
నియాన్ లైట్ల వెలుగులో మత్తు కళ్లతో ఆమె మరింత అందంగా కనిపించడమే ఈ ఫొటోలో విశేషం. తన అభిమానుల కోసమే ఈ ఫొటో అంటోందామె. ఇక నుంచి అభిమానుల కోసం కొత్త కొత్త ఫొటోలను వదులుతుంటుందట. స్కర్ట్ ధరించి ఫొటో దిగిందామె. ఆమె ఇన్ స్టా అకౌంటులోకి వెళితే ఫైనాపిల్ రంగులో ఉన్న టాప్ ధరించిన మూడు ఫొటోలు కనిపిస్తాయి. నియాన్ బ్లూ, ఎల్లో లైట్ పక్కన కూర్చున్న మూడు ఫోటోలను షేర్ చేసింది. జుట్టును వదులుగా ఆకర్షణీయంగా వదిలేసింది. మెడలో లాకెట్ ఉంది.
షారుఖ్ ఖాన్ నిర్మించే ‘డార్లింగ్స్’ చిత్రంలోనూ ఆలియా నటిస్తోంది. ఇందులో షెఫాలీ షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ట్రిపుల్ ఆర్ సంగతి తెలిసిందే. రణ్ బీర్ కపూర్ తో ‘బ్రహ్మస్త్ర’ ఉండనే ఉంది. ఇవి కాక ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ లతో కలిసి జీ లే జరా చేస్తున్నారు. దీనికి ఫరాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తానికి ఆలియా కెరీర్ పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగానే ముందుకు సాగుతోంది.
Must Read ;- ఇన్ స్టా లైవ్ లో రేణు దేశాయ్ కి చిలిపి ప్రశ్నలు











