మదనపల్లెలో జరిగన జంట హత్యలు మాటల్లో వర్ణింపరాని గోరమని చెప్పాలి. కన్న తల్లిదండ్రులే.. కూతుళ్లను కడతేర్చిన ఘటన విని కళ్లుచెమర్చని వారండరు. ఈ దారుణానికి పాల్పడిన వారిని పరిశీలించిన డాక్టర్లు అందించిన సమాచారం మేరకు, వారు ‘డెల్యూషన్స్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేశారు. అసలేంటి డెల్యూషన్స్ వ్యాధి? ఈ వ్యాధికి.. ఇంతటి దారుణ చర్యకు సంబంధం ఏంటి? ఇలాంటి వాటి గురించి తెలుసుకుందాం రండి..
డెల్యూషన్స్ వ్యాధి అంటే ఏమిటి?
ఊహా ప్రపంచం.. ఎంతో అందంగా ఎవరికి వారు నిర్మించుకునే కలల సౌధం. అందులో నిన్ను, నువ్వు ఎలాగైనా ఊహించుకోవచ్చు. రాజుగా.. ధనవంతుడిగా.. చివరికి భగవంతుడిగా కూడా ఊహించుకుని బతకచ్చు. నిజానికి ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఇలా ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ల గురించే కాదు.. పక్క వాళ్లు గురించి కూడా. కానీ, ఆ ఊహ ప్రపంచంలోనే జీవిస్తూ.. వాస్తవికతను అంగీకరించపోతే.. ఏమవుతుంది అనుకుంటున్నారా? ఊహలో నువ్వొక రాజువో.. దేవుడివో.. కావచ్చు. కానీ, నిజ జీవితంలో అలా అయ్యేందుకు అవకాశాలే లేవు. దాన్ని కొందరు అంగీకరించరు.. నేను రాజును, దేవుడిని.. అంటూ పిచ్చి కేకలు పెడుతుంటారు. వీళ్లేంటి ఇలా చేస్తున్నారని మనమనుకుంటాం. కానీ, నిజానికి అటువంటి వారు ‘డెల్యూషన్స్’ అనే వ్యాధితో బాధపడుతుండడం వల్ల అలా ప్రవర్తిస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. వాస్తవికతను అంగీకరించక, తాము నిర్మించుకున్న కలల రాజ్యంలో జీవిస్తూ.. అదే నిజమని అనుకుంటూ.. అందరినీ ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటారు ఈ వ్యాధికి గురైన వ్యక్తులు.
ఈ డెల్యూషన్స్ వ్యాధి లక్షణాలేంటి?
ఎంతమంది ఎన్ని చెప్తున్నా వినకుండా వారు అనుకున్నదే నిజమని వాదిస్తూ.. చుట్టూ ఉన్న వాస్తవికతకు తాము ఊహించుకుంటున్నది విరుద్దంగా ఉన్నా కూడా అంగీకరించక వితండ వాదన చేస్తుంటారు కొందరు. ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు వారి వ్యాధి తీవ్రస్థాయిలో ఉందని తెలుసుకోవాలి.
ఇందులో మరో రకం వ్యక్తులు కూడా ఉన్నారు. కొందరు కవులు, కథలు రాసే వాళ్లు కూడా ఊహా ప్రపంచం లేనిదే వారి రచనలు పూర్తవ్వవు. కానీ, వారు తమ పని చేస్తుంన్నంతసేపు మాత్రమే ఒక ఊహకు కట్టుబడతారు. నిజ జీవితంలో తామేంటనే స్పృహ కలిగి ఉంటారు. అదే విపరీత ధోరణికి, మామూలు స్థితికి ఉన్న తేడా.
Must Read ;- మదనపల్లె అమ్మాయి తరహాలో మరో పిచ్చోడు చావడానికి రెడి!

అసలు ఈ వ్యాధికి కారణాలేంటి?
ఈ వ్యాధి బారిన పడడానికి కచ్చితమైన కారణాన్ని చెప్పట్లేదు నిపుణులు. కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతావరణం, జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, దేనికోసమైనా తీవ్రంగా ప్రయత్నించి దక్కించుకోలేని సమయంలో.. ఊహించుకుంటూ బతకడం. Schizophrenia అనే సమస్యతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఉంటే కూడా వారసత్వంగా ఇలాంటి వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒత్తిడిని తట్టుకోలేని స్థితిలో ఇలాంటి పరిస్థితిలోకి వెళ్లిపోయే అవకాశాలు ఉంటాయి. ఒంటరిగా ఎక్కువ కాలం ఉండాల్సి రావడం వల్ల కూడా ఇలాంటి సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
ఎలా గుర్తించాలి?
ఇది కేవలం వారి ప్రవర్తన ద్వారా మాత్రమే గుర్తించగలం. కొందరు వారి ఊహలను తమ వాళ్లతో పంచుకుంటారు. మరి కొందరు నర్మగర్భంగా సూచలిస్తుంటారు. పూర్వ జన్మల గురించి, పునర్జన్మల గురించి ఏ మాత్రం సీరియస్‌గా మాట్లాడుతున్నా.. ఆ విషయాన్ని తేలికగా తీసుకోకూడదు. ఏదైనా మొగ్గలోనో తుంచడానకి ప్రయత్నించాలి. లేకపోతే వారు ఊహించుకుంటున్నదే వాస్తమనే స్థాయికి వెళ్లిపోతారు. అలాంటి సమయంలో కూడా వారికి చికిత్స అందించడం ద్వారా బాగు చేయచ్చు. కానీ, అది ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు.. కాస్త కష్టంతో కూడుకున్నపనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీని వల్ల కలిగే పరిణామాలు ఏంటి?
ఇలా ఊహా ప్రపంచంలో జీవిస్తూ ఉండడం వల్ల అన్ని దుష్పరిణామాలే ఎదురవుతాయి అనుకుంటే పొరపాటే. ఊహా ప్రపంచంలేనిదే.. సినిమాల, కవిత్వాలు, రచనలు.. ఇలా ఏవీ ఉండవు. ఇవన్నీ ఊహా ప్రపంచంతో ముడిపడినవే. కానీ అది కేవలం వాటి వరకే ఉన్నంత వరకు సమస్యలు ఉండవు. కానీ వాస్తవికతతో సంబంధాలు తెంచేసుకుని, వారు ఊహించుకున్నట్లు ప్రస్తుత ప్రపంచంలో తమని గుర్తించాలని భావించినపుడే అసలు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి సమయంలో కూడా పాజిటివిటిగా బతికే వారున్నారు. కానీ కొందురు తమని తాము సుప్రీంగా భావిస్తూ.. అందరూ తమ మాటే వినాలనే ఊహలో నిలిచిపోతారు.. లేదా అన్నింటినీ నెగిటివ్‌గా ఊహించుకుంటూ ప్రాణలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఊహానే జీవితంగా మార్చుకుంటే జీవితం తల్లకిందులవక మానదు.
చికిత్స..
ఏదేదో ఊహించుకుంటూ ఇబ్బందిపడుతున్నారని తెలిసినపుడే కౌన్సలింగ్ లాంటివి ఇప్పిస్తే వారిని వాస్తవంలోకి తీసుకురావచ్చు. అలా కాకుండా తేలిగ్గా తీసుకుని వదిలేస్తే.. కొందరు వాటి నుంచి తమంతట తాము బయటపడేవారున్నారు.. మరికొందరు మరింత లోతుకు వెళ్లిపోతారు. అలాంటి సమయంలో దానికి సంబంధించిన మందులు వాడక తప్పదంటున్నారు నిపుణులు. కౌన్సలింగ్‌తోపాటు.. మందులు కూడా ఒక కోర్సు లాగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వారి మెదడు నిజాలని అంగీకరించే స్థితికి చేరుకుంటుంది.
Also Read ;- శివుడికే కరోనా పరీక్షలా!











