పెద్ద హీరోల విషయంలో సినిమాల లైనప్ ఎప్పుడూ అయోమయంగానే ఉంటుంది. అప్పటివరకు
అనుకున్న సినిమా ఆఖరి నిమిషంలో డ్రాప్ అవ్వడం అనేది టాలీవుడ్ లో సర్వసాధారణం. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా ఏ పెద్ద హీరోను తీసుకున్నప్పటికీ ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు క్లియర్ అవుతుంది. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఇది ఓ బ్రహ్మపదార్థంగా మారింది. దీనికి కారణం పుష్ప సినిమా రెండు భాగాలుగా రావడమే.
ఎప్పుడైతే పుష్ప సినిమాను 2 భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించారో అప్పుడే బన్నీ లైనప్ మారిపోయింది. అయితే ఇప్పుడు ఇందులో కొత్త ట్విస్ట్ ఏంటంటే.. పుష్ప-1 వచ్చిన తర్వాత వేరే సినిమా వస్తుందట. ఆ తర్వాత పుష్ప-2 వస్తుందని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు జనాల్ని మాత్రం కన్ప్యూజ్ చేస్తోంది.
బాహుబలి-1 వచ్చిన తర్వాత ప్రభాస్ వేరే సినిమా చేయలేదు. బాహుబలి-2 మాత్రమే చేశాడు. ఇది అత్యంత సహజం కూడా. ఎవరైనా ఇలానే ఊహిస్తారు. కానీ పుష్ప విషయంలో ఇలా జరగడం లేదని తెలుస్తోంది. ముందుగా పుష్ప-1ను రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత బన్నీ, ఐకాన్ ప్రాజెక్టుకు షిప్ట్ అవుతాడట. అదే టైమ్ లో సుకుమార్ కూడా విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేస్తాడట. ఆ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత బన్నీ-సుక్కూ మళ్లీ కలుస్తారట. పుష్ప పార్ట్-2 స్టార్ట్ చేస్తారట. ఇదెక్కడి విడ్డూరమో అర్థం కావడం లేదు.
అంటే, ఆర్డర్ ప్రకారం చూసుకుంటే, ముందుగా పుష్ప-1 రిలీజ్ అయి, ఆ తర్వాత ఐకాన్ సినిమా వస్తుంది. ఆ తర్వాత పుష్ప-2 వస్తుందన్నమాట. ఒకవేళ పుష్ప-1 క్లైమాక్స్ లో బాహుబలి టైపులో ఏవైనా పెద్ద ట్విస్టులు పెడితే మాత్రం.. ఆ సస్పెన్స్ ఏంటో తెలియాలంటే దాదాపు ఏడాదిన్నర ఆగాల్సి వస్తుందన్నమాట. బన్నీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వరకు కరెక్టో తెలియదు కానీ, ఆడియన్స్ లో మాత్రం చాలా అనుమానాలు రేకెత్తిస్తోంది.
మరోవైపు బన్నీ ఇలాంటి నిర్ణయం తీసుకోడని అంటున్నారు మరికొందరు. పార్ట్-1, పార్ట్-2 బ్యాక్ టు బ్యాక్ రిలీజైన తర్వాతే ఐకాన్ సినిమా వస్తుందంటున్నారు. ఇలా అనుకుంటే అటు చిక్కులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. వేణుశ్రీరామ్ అప్పటివరకు వెయిట్ చేయకపోవచ్చు. ఇటు విజయ్ దేవరకొండ కూడా బిజీ అయిపోతాడు. సుకుమార్ కు దొరకడు. మరి ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏంటో?
Must Read ;- బన్నీ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట