అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం పుష్ప. ఈ సినిమాని ఏ ముహుర్తాన ప్రారంభించారో కానీ.. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అల.. వైకుంఠపురములో.. సినిమా తర్వాత వెంటనే ఈ సినిమా స్టార్ట్ చేయాలనుకున్నాడు. అయితే… కరోనా కారణంగా ఆగింది. ఆతర్వాత ఈ మూవీ షూటింగ్ ప్రారంభించడం విషయంలో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముందు అనుకున్నట్టుగా కేరళలో స్టార్ట్ చేయాలా..? లేక హైదరాబాద్ సమీపంలో సెట్ వేసి షూటింగ్ చేయాలా..? అనుకున్నారు. ఆఖరికి రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లిలో షూటింగ్ స్టార్ట్ చేశారు.
అయితే.. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొన్నారు. 150కన్నా ఎక్కువ మంది ఉండకూడదు అని చెప్పినప్పటికీ… అంతకు మించి.. యూనిట్ మెంబర్స్ సెట్ లో ఉండడంతో కొంత మందిలో కరోనా లక్షణాలు కనిపించాయట. అంతే.. వెంటనే షూటింగ్ ఆపేశారట. అల్లు అర్జున్ హైదరాబాద్ చేరుకున్నారని తెలిసింది. మళ్లీ ఎప్పుడు పుష్ప షూటింగ్ స్టార్ట్ అవుతుందో ఇప్పుడు చెప్పడం కష్టం అంటున్నారు. ప్రధాన సాంకేతికనిపుణులకు ఎవరికైనా కరోనా వచ్చిందో లేదో ఇంకా తెలియదు.
ఒకవేళ అలా… జరిగితే షూటింగ్ స్టార్ట్ కావడానికి మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా షూటింగ్ ఆపేయాల్సి రావడంతో సుకుమార్ బాగా ఫీలవుతున్నారట. పుష్ప షూటింగ్ కరోనా వలన ఆగిపోవడంతో సెట్స్ పై ఉన్న భారీ చిత్రాలు ఆర్ఆర్ఆర్, రాథేశ్యామ్, ఆచార్య తదితర చిత్రాలకు టెన్షనే అని చెప్పచ్చు. జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నప్పటికీ… మరింతగా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. మరి.. పుష్ప షూటింగ్ ఆగిపోవడం పై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కానీ, హీరో అల్లు అర్జున్ కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- ‘సర్కారు వారి పాట’ ప్లాన్ మారింది.. ఏంటా ప్లాన్?











