యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాథేశ్యామ్ సినిమా చేస్తున్నారు. జిల్ ఫేమ్ రాథాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం ఇటీవల ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే… ప్రభాస్ మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ మూవీని ఎనౌన్స్ చేసి అందరికి సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తుంది. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటించనున్నారు.
ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే… ప్రభాస్ బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ ఎనౌన్స్ చేసి ఒక విధంగా షాక్ ఇచ్చాడని చెప్పచ్చు. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో ప్రభాస్ రాముడుగా నటిస్తుంటే.. రావణుడు గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ నటించనున్నారు. ఇదిలా ఉంటే.. కన్నడ అగ్రనిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ డిసెంబర్ 2న పాన్ ఇండియా మూవీని ప్రకటించనున్నట్టు తెలియచేసింది.
ఈ సంస్థ ప్రకటించనున్న మూవీ బాహుబలి ప్రభాస్ – కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందనున్న పాన్ ఇండియా మూవీ అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కన్ ఫ్యూజ్ అవుతున్నారు. ఒక విధంగా తమ అభిమాన హీరో వరుసగా సినిమాలు చేస్తున్నందుకు ఆనందపడుతూనే… మరో వైపు సినిమాలు ప్రకటిస్తున్నాడు సరే… అసలు ఈ సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేస్తాడు..? అని ఆలోచనలో పడ్డారట. ప్రభాస్ రాధేశ్యమ్, ఆదిపురుష్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో మూవీ, ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ… వీటిలో రాథేశ్యామ్ 2021 సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. మిగిలిన సినిమాల్లో ఏ సినిమా ముందు వస్తుంది..? అని కన్ ఫ్యూజ్ అవుతున్నారట. మరి… ప్రభాస్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ జనవరి నుంచి షూటింగ్











