పొలిటికల్ లీడర్స్ గా టాలీవుడ్ హీరోలు కనిపించడం చాలా తక్కువ. గతంలో సీనియర్ హీరోలు కొందరు పొలిటికల్ లీడర్స్ గా అలరించినప్పటికీ.. యంగ్ హీరోలు మాత్రం ఆ జోనర్ లోని సినిమాల్ని చాలా తక్కువ గా టచ్ చేశారు. అయితే త్వరలోనే అల్లు అర్జున్ పొలిటికల్ లీడర్ గా నటించబోతున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ సినిమాకి కొరటాల శివ దర్శకుడు అవడం మరో విశేషం. మొన్నీ మధ్య బన్నీ, కొరటాల కాంబో మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత కొరటాల చేయబోయే సినిమా అదే. అల్లు అర్జున్ 21వ మూవీగా అల్లు అరవింద్ సమర్పణలో.. యువసుధ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
‘రేసుగుర్రం’ సినిమా కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది కానీ.. బన్నీ అందులో పొలిటికల్ లీడర్ కాదు. అయితే కొరటాల శివ సినిమాలో మాత్రం బన్నీ యువ రాజకీయ నేతగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. స్టూడెంట్స్ పాలిటిక్స్, పేదరికం, నిరక్షరాస్యత లాంటి అంశాలతో కూడిన ఒక సామాజిక సందేశం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఇందులో బన్నీ స్టైలాఫ్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు .. కొరటాల తరహా సందేశం కూడా మిక్స్ అవనుండడం విశేషం. ఇదే కానీ నిజమైతే.. బన్నీ ఫ్యాన్స్ కు పండగే. ఆచార్య సినిమా పూర్తి కాగానే.. కొరటాల ఈ సినిమా స్ర్కిప్ట్ వర్క్ ప్రారంభిస్తాడట. మరి నిజంగానే కొరటాల శివ సినిమాలో బన్నీ పొలిటికల్ లీడర్ అవతారంలో కనిపిస్తాడేమో చూడాలి.
Must Read ;- అల్లు అర్జున్ కు వార్నర్ వెల్ డన్ ఎందుకు చెప్పారు?











