September 6, 2026 7:04 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘వివేకా’ నిందితుల రేంజి ఇది!

జ‌గ‌న్ బాబాయి వైఎస్ వివేకా హ‌త్య కేసులో కీల‌క నిందితుడు సునీల్ కుమార్ యాద‌వ్ ఫ్యామిలీ రేంజి మామూలుగా లేద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అత‌డి సోద‌రుడు కిర‌ణ్ కుమార్ యాద‌వ్ ఏకంగా హోం మంత్రి సుచ‌రిత‌తోనే క‌లిసి క‌నిపించిన ఫొటో ఇప్పుడు వైర‌ల్ గా మారిపోయింది.

August 4, 2021 at 11:08 AM
in Andhra Pradesh, Latest News, Top Stories
Kiran Kumar Yadav Spotted With Home Minister Sucharitha
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Kiran Kumar Yadav Spotted With Home Minister Sucharitha : 

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో కీల‌క నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ యాద‌వ్ ఫ్యామిలీ నిజంగానే వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టుగా చెప్పే ఆధారాలు ఇప్పుడు అమితాస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ కేసు ద‌ర్యాప్తును సీబీఐ చేప‌ట్టిన త‌ర్వాత వివేకా హ‌త్య‌కు దారి తీసిన కార‌ణాలు, దాడి వెనుక ఉన్న గూడు పుఠానీ క్ర‌మంగా వీడుతోంది. ఈ క్ర‌మంలో పులివెందుల‌లోని ఇంటికి తాళం వేసి మ‌రీ గోవా చెక్కేసిన సునీల్ ఫ్యామిలీ జాడ‌ను ప‌ట్టేసిన సీబీఐ అధికారులు.. మంగ‌ళ‌వారం గోవాలోనే సునీల్ ను అరెస్ట్ చేశారు. గోవాకు సీబీఐ అధికారులు చేరుకున్న విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన సునీల్‌.. అక్క‌డి నుంచి కూడా పారిపోయేందుకు య‌త్నించాడ‌ట‌. అయితే ఏపీ నుంచి గోవాకు వెళ్లిన సునీల్ జాడ‌ను ప‌ట్టేసి అక్క‌డికి చేరుకున్న సీబీఐ.. అత‌డు పారిపోతుంటే చూస్తూ ఊరుకోదు క‌దా. సునీల్ ను గోవాలోనే వెంటాడి వేటాడి మ‌రీ ప‌ట్టేసింది. ఆ త‌ర్వాత గోవా నుంచి సునీల్ ను ప్ర‌త్యేక వాహ‌నంలో బెంగ‌ళూరు మీదుగా క‌డ‌ప‌కు తీసుకొచ్చింది. మంగ‌ళ‌వారం మొత్తం అత‌డిని విచారించిన సీబీఐ అధికారులు.. బుధ‌వారం నాడు అత‌డిని కోర్టులో హాజ‌రు ప‌రిచే అవ‌కాశాలున్నాయి.

హోం మంత్రితో సునీల్ త‌మ్ముడు

ఇదిలా ఉంటే.. సునీల్ కుమార్ యాద‌వ్ అరెస్ట్ అయిన నేప‌థ్యంలో తాజాగా ట్విట్ట‌ర్ లో క‌నిపించిన ఓ ఫొటో వైర‌ల్ గా మారిపోయింది. ఈ ఫొటోలో సునీల్ సోద‌రుడు కిర‌ణ్ కుమార్ యాద‌వ్ ఏకంగా రాష్ట్ర హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌తో క‌లిసి చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపిస్తున్నాడు. ఏదో విజ్ఞాప‌న ప‌త్రం ఇచ్చేందుకు సుచ‌రిత వ‌ద్ద‌కు వెళ్లిన కిర‌ణ్.. ఆమెతో క‌లిసి ఫొటో దిగిన వైనం చూస్తుంటే.. వైసీపీలో సునీల్ ఫ్యామిలీకి ఏ మేర ప్రాధాన్యం ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. 2020, అక్టోబ‌ర్ 27న తీసిన‌ట్లుగా చెబుతున్న ఈ ఫొటోపై సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర కామెంట్లు పోస్ట్ అవుతున్నాయి. వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ అధికారుల నుంచి త‌ప్పించుకుని తిరుగుతున్న వ్య‌క్తుల‌కు రాష్ట్ర హోం మంత్రినే నేరుగా క‌లిసే యాక్సెస్ ఎవ‌రు ఇచ్చారంటూ సంచ‌ల‌న కామెంట్లు పోస్ట్ అవుతున్నాయి. సీబీఐ వెంటాడుతున్న ఈ వ్య‌క్తుల‌కు హోం మంత్రిని కలిసే స్వేచ్ఛ ఎవ‌రు ఇచ్చార‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఫ్యామిలీ మొత్తంపైనా అనుమానాలు

ఇక సీబీఐ ద‌ర్యాప్తులో సునీల్ ఫ్యామిలీ కేంద్రంగానే కీల‌క విచార‌ణ సాగుతోంది. ఇదివ‌ర‌కే సునీల్ ను ప‌లుమార్లు పిలిచి ప్ర‌శ్నించిన సీబీఐ అధికారులు.. ఓ సారి అత‌డిని ఏకంగా ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాల‌యానికి త‌ర‌లించి ఏకంగా నెల రోజుల‌పాటు అక్క‌డే ఉంచి విచారించిన‌ట్లుగా తాజాగా తెలుస్తోంది. అంతేకాకుండా సునీల్ తో పాటు ఇప్పుడు హోం మంత్రితో క‌లిసి క‌నిపించిన అత‌డి సోద‌రుడు కిర‌ణ్ కుమార్ యాద‌వ్ ను కూడా సీబీఐ అధికారులు ఇదివ‌ర‌కే ప‌లుమార్లు విచారించారు. సునీల్ తండ్రి కృష్ణ‌య్య‌తో పాటు అత‌డి త‌ల్లిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. వివేకా పొలాల‌ను ప‌ర్య‌వేక్షించే ఉమాశంక‌ర్ రెడ్డితో సాన్నిహిత్యం పెంచుకున్న సునీల్.. ఆ క్ర‌మంలోనే వివేకాకు ద‌గ్గ‌ర‌య్యాడ‌ట‌. ఆ త‌ర్వాత సునీల్ ఫ్యామిలీ మొత్తం కూడా వివేకాకు స‌న్నిహితంగానే మెల‌గింద‌ట‌. అయితే ఏమైందో గానీ.. వివేకాతో సునీల్ కు విబేధాలె పొడ‌చూప‌డంతో అత‌డిని వివేకా దూరం పెట్టిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ త‌ర్వాత వివేకా త‌న సొంత ఇంటిలోనే దారుణ హ‌త్య‌కు గురి కావ‌డం, ఆ త‌ర్వాత విచార‌ణ‌కు రెండు సిట్ లు ఏర్పాటు కావ‌డం, అయినా ద‌ర్యాప్తులో ఆశించిన మేర పురోగ‌తి లేక‌పోవ‌డం.. వివేకా కూతురు డాక్ట‌ర్ సునీత అభ్య‌ర్థ‌న మేర‌కు హైకోర్టు ఆదేశాల‌తో సీబీఐ ఎంట్రీ ఇవ్వ‌డం, ఇప్పుడు డొంక మొత్తం క‌దులుతుండ‌టం, అందులో తొలి అరెస్ట్ గా సునీల్ కుమార్ నే సీబీఐ ప‌ట్టుకోవ‌డం చూస్తుంటే.. ఈ హ‌త్య వెనుక సునీలే కీలకంగా వ్య‌హ‌రించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ కేసు చిక్కుముడి మ‌రికొన్ని రోజుల్లోనే వీడిపోనుంద‌ని కూడా చెప్ప‌వ‌చ్చు.

కోర్టుకు సునీల్ ఒక్కడే

ఇదిలా ఉంటే.. ఈ కేసులో సునీల్ కుమార్‌ యాదవ్ ను సీబీఐ అధికారులు బుధ‌వారం మధ్యాహ్నం పులివెందులకు తరలించారు. అక్కడి కోర్టులో న్యాయమూర్తి ఎదుట అతడిని హాజరుపరిచారు. సునీల్ తో పాటు వివేకా ప్ర‌ధాన అనుచ‌రుడిగా భావిస్తున్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ ను వివేకాకు ప‌రిచ‌యం చేసిన ఉమాశంక‌ర్ రెడ్డిల‌ను కూడా సీబీఐ అరెస్ట్ చేస్తుంద‌న్న వార్త‌లు వినిపించినా.. సునీల్ ఒక్క‌డినే కోర్టులో హాజ‌రుప‌రిచింది. దీంతో వివేకా కేసులో తొలి అరెస్ట్ అధికారికంగా నమోదైనట్టైంది.

Must Read ;- ఏపీ సీఎం జ‌గ‌న్ ఇక మాజీనే

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newscbihome minister mekatoti sucharithaHome Minister Sucharithakiran kumar yadavKiran Kumar Yadav Spotted With Home Minister SucharithaLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleotoppulivendulasunil kumar yadavsunithatelugu newsviveka murder caseys jagan babaiys vivekananda reddyysrcp leader
Previous Post

తెలుగు ‘బిగ్ బాస్ 5’కు తెర లేస్తోంది

Next Post

దేవినేనికి బెయిల్‌!.. జ‌గ‌న్ కు మ‌రో షాకే క‌దా!

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ప్రభాస్ “ఆదిపురుష్” చిత్రంపై కోర్టులో పిటిషన్

బిగ్ బ్రేకింగ్‌.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist