సెలబ్రిటీలంతా యూట్యూబర్లుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఆ కోవలోకి మంచు లక్ష్మి కూడా వచ్చేశారు. సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటివి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. మెయిల్ ఐడీ ఉన్న ప్రతి ఒక్కరూ ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టేసుకుంటున్నారు. ఎవరో వచ్చి ఇంటర్వ్యూ చేయాల్సిన పనిలేదు. ‘మా ఛానెల్ మా ఇష్టం’ స్థితికి సెలబ్రిటీలు వచ్చేశారు. మంచు లక్ష్మి తన హోంటూర్ తనే చేసుకోవడం విశేషం.
ఇటీవలే ఆమె యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. అందులో తొలి వీడియా కూడా ఇదే. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్‌లలో కూడా ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. వాటిలో చెప్పలేని విషయాలను యూట్యూబ్ ద్వారా పంచుకుంటానని తన ఫాలోవర్స్ కు చెబుతోంది. ఆమె ఫాలోవర్లు తన ఇల్లు చూపించమని అడుగుతుండటంతో ఈ వీడియో చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. మంచు లక్ష్మి ఇల్లు మరెక్కడో లేదు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఉంది. మంచి ఇంటీరియర్ తో సర్వాంగ సుందరంగా ఆ ఇల్లు ఉంది. ఇల్లంతా కలియతిరుగుతూ ఆమె వీడియో చేసింది. ఆఫీస్ గది, వంటగది, లివింగ్ రూమ్.. ఇలా అన్ని గదుల్లోకీ ఆమె కెమెరా వెళ్లిపోయింది. అన్నట్టు ఇది ప్రోమో మాత్రమే. పూర్తి వీడియో ఉంది.
అది డూప్లెక్స్ హౌస్. మోహన్ బాబు మొదట్లో ఉన్న ఇల్లు కూడా అదే కావచ్చు. కాకపోతే చాలా మార్పులు ఆ ఇంట్లో వచ్చేశాయి. ఈ ఇల్లు చూసి నెటిజన్లు కూడా విపరీతమైన కామెంట్లు చేశారు. మంచు లక్ష్మి ఇల్లు మంచిగానే కాదు ఓ ఇంద్ర భవనంలా ఉందనే కామెంట్లు వచ్చాయి. ఆమె తన ఛానెల్ గురంచి చెప్పే వీడియా మిలియన్ వ్యూస్ కి చేరువైతే ఈ హోం టూర్ వీడియో ఒక్క రోజులోనే లక్షన్నర వ్యూస్ కు చేరువైంది. మున్ముందు తన సోదరుల ఇళ్లు, తండ్రి ఇల్లు కూడా చూపించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దటీజ్ మంచు లక్ష్మి అనుకోవాలేమో.
Must Read ;- మనోజ్ అహం బ్రహ్మాస్మి చిత్రంలో బాలీవుడ్ హీరో.?











