ఏపీ ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురుదెబ్బలు కొత్తేమీ కాదు.. వాటిపై సుప్రీం కోర్టును ఆశ్రయించడమూ కొత్త కాదు.. తమకు వ్యతిరేకంగా ఏ జడ్జి ఆర్టర్స్ ఇచ్చినా.. ఆ జడ్జి పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ వారిని కేసు నుంచి తొలగించాలంటూ ప్రభుత్వం గగ్గోలు పెట్టడం మొదలెడుతుంది. ఈ విషయంలో మీది తప్పుని చెప్పన వెంటనే జడ్జిలు అని కూడా చూడకుండా వారిపై బురద జల్లడానికి ప్రయత్నించడం జగన్ సర్కార్‌కు పరిపాటైపోయింది. అదేమన్నా అంటే ప్రతిపక్షాలు చెప్పనట్లు కోర్టులు చేస్తున్నాయనే విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తారు. తాజాగా ఆంధ్ర హైకోర్టులో ప్రభుత్వానికి మరో మొట్టికాయపడింది. ఇంకేందుకు ఆలస్యం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేసింది ప్రభుత్వం.
మిషన్ బిల్డ్ ఏపీ కేసులో ప్రవిణ్ కుమార్ పై క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనుమతులు ఇస్తూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ భూముల వేలం కేసులో జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుకోవాల్సిందిగా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తప్పుపట్టింది. అంతేకాదు.. జడ్డిలపై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రవీణ్ కుమార్ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని ప్రభుత్వానికి ఆరు వారాలు సమయం ఇచ్చింది కోర్టు. తాజాగా జరిగిన విచారణలో ప్రవీణ్ కుమార్ పై క్రిమినల్ పాజిక్యూషన్ ప్రొసీడింగ్స్ జరపాలని రిజిస్ట్రార్‌ను ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Must Read ;- ప్రభుత్వం వేధిస్తున్నదంటూ సీనియర్ ఐపీఎస్ లేఖ