కోర్టుతో మొట్టికాయలు తినడమే తప్ప మినహాయింపులు ఎరుగని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట లభించింది. రాష్ట్రంలో రాజ్యంగ విచ్ఛన్నం జరిగిందా అనే అంశంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలపై కలపాటును వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. రాష్ట్ర కోర్టు అసలెందుకలాంటి ఆదేశాలు జారీ చేసిందని అనుమానాలు వ్యక్తం చేసింది. రాష్ట్రం పనితీరు సరిగ్గా ఉందా లేదా వ్యవస్థ కుప్పకూలిందా అంటూ ప్రశ్నించింది. చివరికి కేసును శీతాకాల సెలవుల అనంతరం విచారణ చేస్తాయని చెప్పింది. అంతవరకు స్టే అమలులో ఉంటుందని తెలియజేసింది.
ఏపీలో వరసగా హెబియస్ కార్పస్ పిటీషన్ల దాఖలయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పోలీసుల ప్రవర్తనపై విసుగుచెందిన కోర్టు ప్రభుత్వం కోసం పనిచేయకండి.. ప్రజలను కాపాడడం మీ పనని మర్చిపోకండని వ్యాఖ్యానించింది. అయినా పోలీసుల తీరు మారలేదు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైతుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రపర్తించాలని మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ వేసిన పిటీషన్ విచారిస్తున్న నేపథ్యంలో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ అనేది పనిచేస్తుందా లేక విచ్ఛన్నం చెందిందా అంటూ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దాన్ని విచారించిన కోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది.
స్టే ఇచ్చినా.. సుప్రీం వ్యాఖ్యలు కలవరపరుస్తున్నాయి..
హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ప్రభుత్వం సంబపడుతున్నా.. కోర్టు వ్యాఖ్యలు గమనిస్తే కలవరం తప్పదని ఇట్టే తెలుస్తుంది. రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నం చెందిందా అనే దానికి విచారణకు ఆదేశాలు జారీ చేసిన సమయంలో హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం కలవరపాటును వ్యక్తం చేసింది. కోర్టు ఇంతటి బలమైన వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు తెలియట్లేదని వ్యాఖ్యనించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం రాజ్యంగ విచ్ఛిన్నం గురించి వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగిస్తుందని సుప్రీం వ్యాఖ్యానించిందని ప్రభుత్వం మరవకూడదు. హై కోర్టు ఆదేశాలు చూస్తుంటే వ్యవస్థ కుప్పకూలలేదు కదా అంటూ అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. వీటిని బట్టి చూస్తే స్టే ఇవ్వడం ఆనందించతగ్గ విషయమైనా.. ఆ సందర్భంగా సుప్రీం చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వ విధానాలపై హైకోర్టు వ్యాఖ్యలకు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం మనం గమనించాలి.
Must Read ;- సుప్రీంలో సంచలన పిటిషన్.. జగన్ బెయిల్ రద్దేనా?