రీతూ వర్మ పేరు చెప్పగానే ‘పెళ్లిచూపులు‘ పిల్లే గదా అనేస్తారు ఎవరైనా. అంతగా ఆ సినిమాతో ఆమె ప్రేక్షకులకు చేరువైంది. ‘పెళ్లి చూపులు’ సినిమాలో రీతూ వర్మకి దక్కిన పాత్ర .. ఆ సినిమా విజయవంతం కావడం ఆమెకి బాగా కలిసొచ్చింది. అమ్మయి కుదురుగా .. పద్ధతికి పట్టుచీర కట్టినట్టుగా ఉందని అనుకున్నారు. ఆ తరువాత ఈ అమ్మాయి నిఖిల్ జోడీగా ‘కేశవ’ సినిమా చేసింది. ఆ సినిమా పరాజయంపాలు కావడంతో తెలుగులో అవకాశాలు అంతగా రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది.
కోలీవుడ్ లో రీతూ వర్మ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ధనుశ్ మూవీ ‘వీఐపీ 2’ సినిమాలోనూ .. దుల్కర్ సల్మాన్ సినిమా ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు అక్కడ ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా దుల్కర్ తో చేసిన మూవీ కారణంగా అక్కడ ఆమె అందరి దృష్టిలో పడింది. ఏకంగా విక్రమ్ సరసన ‘ధృవ నచ్చత్తిరమ్’ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. అక్కడ ఆ ప్రాజెక్టు నడుస్తూ ఉండగానే మళ్లీ ఆమెకి తెలుగు నుంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా ప్రస్తుతం ఆమె నానీ .. శర్వానంద్ .. నాగశౌర్య సరసన వరుస సినిమాలు చేస్తోంది.
నాని కథానాయకుడిగా దర్శకుడు శివ నిర్వాణ ‘టక్ జగదీశ్‘ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా రీతూ వర్మ నటిస్తోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక శర్వానంద్ జోడీగా కూడా ఆమె అలరించనుంది. శ్రీకార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా ఆల్రెడీ షూటింగు పార్టును పూర్తి చేసుకుంది.ఇక నాగశౌర్య నాయికగా ఆమె ‘వరుడు కావలెను’ చేస్తోంది. గతంలో కృష్ణవంశీ దగ్గర డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేసిన లక్ష్మీ సౌజన్య ఈ సినిమాకి దర్శకులురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా కూడా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇలా ఈ ఏడాది అంతా కూడా రీతూ వర్మ తెలుగు ప్రేక్షకులకు టచ్ లోనే ఉండనుంది. చూస్తుంటే ఈ బ్యూటీ తన జోరు పెంచుతున్నట్టుగానే కనిపిస్తోంది.
Must Read ;- జోడు గుర్రాలపై జోరుమీదున్న బ్యూటీ