ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ నిరుద్యోగులను రోడ్డున పడేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘‘రావాలి జగన్.. కావాలి జగన్’’ ఆశలు కల్పించి అధికారం కైవసం చేసుకున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇంటికో ఉద్యోం అని చెప్పి ఉద్యోగాలపై ఆశలు కల్పించారని, కీలక పోస్టులకు మంగళం పలికారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాల సీఎం జగన్ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. అందులో మార్చి 2022 వరకు భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను పేర్కొన్నారు. ఆగస్టు-2021 లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ద్వారా కేవలం 36 పోస్టులు భర్తీ చేస్తారనడం హాస్యాస్పదంగా మారింది. పాలన యంత్రాంగంలో కీలకంగా వ్యవహరించే పోస్టులకు కేవలం పదుల సంఖ్యలోనే భర్తీ చేయనుండటం జగన్ పనితనానికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు మండిపడుతున్నారు. ఉద్యోగ క్యాలెండర్ పై ప్రతిపక్ష నాయకులతోపాటు నిరుద్యోగులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అభ్యర్థుల ఆశలపై నీళ్లు
ఒకవైపు కరోనా, మరోవైపు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. ప్రైవేటు ఉద్యోగాల్లో చేరే వారికంటే ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలన్న లక్ష్యంగా గ్రూప్ 1, 2 కు సన్నద్ధమయ్యారు. ఏపీలో కొన్ని వేలమంది అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి విడుదలయ్యే నోటిఫికేషన్లు కోసం ఆశగా ఎదురుచూశారు. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ల పెండింగ్ సైతం అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. తాజాగా జగన్ ప్రభుత్వం కేవలం గ్రూప్ 1, 2 లకు 36 పోస్టులు భర్తీ చేస్తానని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ‘‘జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏటా జనవరి 1నుంచి 30వరకూ శాఖల వారీగా ఖాళీలను భర్తీ చేసేలా నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారని, ఇప్పుడు కేవలం 36 పోస్టులే భర్తీ చేయనున్నారని’’ అవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగులు.
జగన్ అంకెల గారడీ
ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చెబుతున్నవి అంకెల గారడీలేనని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగమని మాట తప్పి కోటి మంది ఉపాధి పోగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం 4.77లక్షల ఉద్యోగాలని అని ప్రకటించి, ఇప్పుడు 6.03 లక్షల ఉద్యోగాలిచ్చామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని యనమల అన్నారు.
Must Read ;- డూబురెడ్డి డాబు జాబ్ కాలెండర్ : నారా లోకేష్