రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే రెండు సార్లు ఆన్‌లైన్ ద్వారా సమావేశం అయిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డకు నోటీసులు పంపించింది. మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులపై వచ్చిన వ్యాఖ్యలపై నోటీసులు అందించారు. నిమ్మగడ్డకు నోటీసులు జారీ చేయడంతో ఆయన సెలవుపై వెళ్లేందుకు ఆటంకం ఏర్పడింది. సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ దీనిపై వివరణ ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి ఇప్పటికే నిర్ణయించారు. వర్చువల్ విధానంలో కమిటీ సభ్యులతో నిన్ననే సమావేశం కూడా నిర్వహించారు. ఇవాళ తాజాగా నిమ్మగడ్డకు నోటీసులు పంపించారు.
తనపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిరాధార ఆరోపణలు చేశారని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నానంటూ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ మంత్రి పెద్దిరెడ్డి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి లేఖ రాయగా, ఆయన దాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. దానిపై రెండు సార్లు చర్చించిన కమిటీ ఛైర్మన్ వివరణ ఇవ్వాలంటూ నిమ్మగడ్డకు ఇవాళ నోటీసులు జారీ చేశారు.
Must Read ;- అనుకున్నదొకటి, అవుతోందొకటి.. కాగితం పులిగా నిమ్మగడ్డ











