కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఏపీలోనూ అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు. ఉండటానికి కటౌట్లు ఉన్నా.. కంటెంట్ లేకపోవడంతో.. ఆ కల కలగానే ఉంది. ఇక బీజేపీ కేంద్రంలో అనుసరిస్తున్న విధానాలతో ఆ కల మరింత దూరమయ్యేలా ఉంది. ప్రత్యేక హోదా కుదరదన్నారు.. రాజధాని రచ్చ జరుగుతున్నా తమకు సంబంధం లేదన్నారు..స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నా కళ్లు, నోరు మూసుకున్నారు. ఇవి చాలదా బీజేపీపై జనం వ్యతిరేకత పెంచుకోవడానికి. కాని మరి అన్నిటిలోనూ ఇన్‌వాల్వ్ అయిన వైసీపీకి విజయం దక్కింది కదా.. తమపై మాత్రం ఎందుకు వ్యతిరేకత ఉంటుందనే ప్రశ్న కూడా వాళ్ల దగ్గరుంది. అయితే ప్రస్తుతం వారి ప్రవర్తన విచిత్రంగా ఉంది.
ఎన్నికల్లో బెదిరింపులు, అరాచకాలు జరిగినా..
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీభత్సంగా బెదిరింపులు, అరాచకాలు జరిగినా.. వారి మిత్రుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించాడే తప్ప.. వీరు మాత్రం పట్టించుకోలేదు. గత ఏడాది నామినేషన్లు వేసినప్పుడు బీజేపీ వారిపైనా దాడులు జరిగితే అప్పుడు తీవ్రంగా ఖండించారు. విమర్శలు గుప్పించారు. కాని ఈసారి మాత్రం సౌండ్ లేదు. పైగా ఎక్కడా సీరియస్‌గా కంటెస్ట్ కూడా చేయలేదు. జనసేనతో పొత్తు అని చెప్పినా… వారికీ సహకరించలేదని.. జనసైనికులే మండిపడ్డారు. పైగా వారు చాలాచోట్ల టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అనధికారికంగా. అయినా మాట్లాడలేదు.
Must Read ;- సమధానం దొరకని ప్రశ్నలు.. పవన్ కన్ఫ్యూజన్
ఏ విషయంలోనూ స్పందన లేదు
పంచాయతీ, మున్సిపల్ పలితాలొచ్చాయి.. వైసీపీ ఘన విజయం సాధించింది. అయినా స్పందించలేదు. చంద్రబాబుపై సీఐడీ కేసు పెట్టింది.. విచారణతో మొదలెట్టి అరెస్టు దాకా వెళ్లాలనుకుంటోంది.. అయినా స్పందించలేదు. పవన్ కల్యాణ్ తెలంగాణ బీజేపీతో కటీఫ్ అన్నారు. దీనికి కూడా ఏమీ మాట్లాడలేదు. స్టీల్ ప్లాంట్ ఇంకా టైముందని వాదించారు. ఏ నోటీఫికేషన్ రాలేదని దబాయించారు. కాని పార్లమెంట్‌లోనే తమ పార్టీ మంత్రులే చాలా క్లియర్‌గా చెప్పేశారు.. అమ్మేస్తామని. స్వయంగా ప్రధాని మోదీయే ప్రకటించారు.. ప్రైవేటీకరణే తమ విధానమని.. ఇక అంతే నోట్లో గుడ్డలు పెట్టుకున్నట్లే మౌనంగా ఉండిపోయారు. ఇప్పటివరకు దానిపై మాట్లాడలేదు. మాట్లాడటం లేదు.
తిరుపతి అభ్యర్ధి ఎవరో తేల్చుకోలేక..
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీయే పోటీ చేస్తుందని ప్రకటించారు. షెడ్యూల్ వచ్చేసింది. ఇఫ్పటి వరకు అభ్యర్ధి ఎవరో తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఫైట్ వైసీపీ, టీడీపీల మధ్యేనని తేలిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే వైసీపీకి బెనిఫిట్ చేసినట్లు అవుతుందని సోమువీర్రాజులాంటోళ్లు అనుకున్నారు.. కాని అది కూడా అయ్యేటట్లు లేదు. మరోవైపు జనసైనికులు పట్టించుకునేటట్లు లేరు. దీంతో తిరుపతిలో పోటీ చేయకా తప్పదు. పరువు పోగొట్టుకోవడమూ తప్పదనే పరిస్ధితి వచ్చేసింది. అయినా ఎక్కడా నోరు మెదపడం లేదు.
వైసీపీకి పూర్తి స్థాయిలో సహకారం
కేంద్ర నాయకత్వం వైసీపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. అవసరమైనప్పుడు నొక్కుతోంది.. కావాల్సినప్పుడు వదిలేస్తోంది. అది ఏ సిట్యుయేషన్ చూసినా అర్ధమవుతూనే ఉంది. ఎందుకంటే బీజేపీకి కేంద్రంలో అన్ని విధాలా వైసీపీ సహకారమందిస్తోంది. ఆఖరికి ఆర్ధికంగా కూడా పుదుచ్చేరి లాంటి చోట్ల సాయం చేశారని ప్రచారం జరుగుతోంది. సంక్షేమ పథకాల బలంతో ఇలాంటి ఎఫెయిర్స్ పబ్లిక్ గానే పెట్టుకుంటోంది వైసీపీ. అందుకే బీజేపీ రాష్ట్ర నాయకత్వం డమ్మీ అయిపోయింది. నోర్మూసుకుని కూర్చోవడం తప్ప.. ఏమీ చేయలేని నిస్సహాయస్ధితిలో పడిపోయింది.
Also Read ;- బీజేపీ వల్లే ఓడిపోయాం.. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్