హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ అభిమానిని కొట్టాడంటూ వైరిపక్షాలు చేస్తున్న నెగెటీవ్ ప్రచారానికి గట్టి షాక్ ఇచ్చాడు..సదరు అభిమాని. తమ అభిమాన నటుడు బాలకృష్ణ మూడురోజులుగా హిందూపురంలో ప్రచారం చేస్తున్నారని, కనీసం ఎవరికీ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చే అవకాశం రాలేదని, తనకు మాత్రం ఆ అవకాశం వచ్చిందని ఓ వీడియో విడుదల చేశాడు. దీంతో అభిమానిపై చేయిజేసుకున్న బాలయ్య అనే ప్రచారానికి తెరపడినట్టైంది.
జరిగింది ఇదీ..
పురపాలక సంఘ ఎన్నికల్లో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు రోజులుగా స్థానికంగా పర్యటిస్తున్నారు. పలు వార్డులు ఏకగ్రీవం అవుతాయని భావించినా.. బాలకృష్ణ హిందూపురంలోనే మకాం వేయడంతో ఏకగ్రీవాలు కుదరలేదు. అంతేకాదు.. నామినేషన్లు వేసిన అభ్యర్థులతో నిరంతరం టచ్‌లో ఉండడంతో పాటు ప్రచారంలోనూ అభిమానుల ఇళ్లకు వెళ్లడం, వారి సమస్యలు తెలుసుకోవడం చేస్తున్నారు బాలకృష్ణ. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఓ అభిమాని ఇంట్లోకి వెళ్లారు బాలకృష్ణ. అప్పటికే అక్కడ జనం పోగు కావడంతో గందరగోళ పరిస్థితి తలెత్తింది. అదే సమయంలో ఓ యువకుడు సెల్ ఫోన్‌తో వీడియో తీస్తున్నారు. దీంతో బాలకృష్ణ ఆ యువకుడిని వారించారు. ఆ క్రమంలో చేయిజేసుకున్నారన్న వీడియో వైరల్ అయింది. ఇక వైసీపీ నుంచి ట్రోల్స్ విపరీతమయ్యాయి.
వీడియో విడుదల..
కాగా సదరు యువకుడి పేరు సోము. తాజాగా ఆ యువకుడు ఓ వీడియో విడుదల చేశాడు. తాను బాలయ్యబాబు అభిమానిని అని వ్యాఖ్యానించాడు. తమ అభిమాన నటుడు మూడురోజులుగా విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారని, అప్పటికే అలిసిపోయారని వ్యాఖ్యానించాడు. నేను ఎవరినో తెలిసే పరిస్థితి అక్కడ లేదని, అయితే మా అన్నయ్య ఇంటికే బాలయ్యబాబు వచ్చారన్నారు. ఈ విషయం బాలయ్యకు తెలియలేదని, బయటి వ్యక్తిగా భావించి తనను బయటకు నెట్టేశారన్నారు. అయినా నేను బాలయ్య అభిమానిని అని వ్యాఖ్యానించిన సదరు యువకుడు.. ఎన్బీకే ఫ్యాన్స్ ఇలాంటివి పట్టించుకోరని, దీన్ని రాజకీయ కోణంలో చూసేవారు మూర్ఖులని వ్యాఖ్యానించాడు. శనివారం నాటి ప్రచారంలో బాలయ్య ఎవరికీ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదని, తనను టచ్ చేశారని, అందుకు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు. అందుకు చాలా గర్వ పడుతున్నానన్నాడు. జై బాలయ్య… జై తెలుగుదేశం అని వీడియో విడుదల చేశాడు ఆ యువకుడు.
గతంలోనూ..
కాగా గతంలోనూ బాలకృష్ణ ఓ అభిమానికి కొట్టిన వీడియో వైరల్ అయింది. తరువాత సదరు యువకుడు తన అభిమాన నటుడు తనను కొడితే తాను బాధపడడం లేదని, బాలయ్య బాబు కోపానికి అర్థం ఉంటుందని వ్యాఖ్యానించాడు. అయితే బాలకృష్ణ కొట్టిన వీడియో వరకే కట్ చేసి మరీ ప్రత్యర్థులు వైరల్ చేస్తుంటారు. ఈ వీడియోలోనూ అలాగే జరిగిందని ఎన్బీకే ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తం మీద తమ అభిమాన నటుడు బాలయ్య బాబు తమను కొట్టినా ఇష్టమేనని, ఆయన తమను టచ్ చేశారని, అందుకు తాము సంతోషిస్తున్నామని బాలకృష్ణ ఫ్యాన్స్ చెబుతుంటారు. తాజా ఘటన కూడా అలాగే జరిగింది.
Must Read ;- దౌర్జన్యాలు ఆపకపోతే ప్రజలు తిరగబడతారు.. వైసీపీ నాయకులకు బాలకృష్ణ హెచ్చరిక











