దేశంలో ఆడవారి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతుండడంతో మగవారికి పెళ్లి కావడమనేది పెద్ద సమస్యగా మారింది. అలాంటి చత్తీస్ గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి చెందిన చందు అనే వ్యక్తి ఒకే ముహుర్తానికి ఇద్దరిని పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఇదేం చిత్రం అని నోరెళ్లబెడుతున్నారు. మరి కొందరైతే ఇక్కడ ఒక పెళ్లికే దిక్కులేదు.. ఇతనేమో ఇద్దరిని చేసుకుంటున్నాడని వారి బాధను వెల్లగక్కుతున్నారు. మరి ఇద్దరినీ ఒకే ముహుర్తంలో చేసుకోవడం ఎలా సాధ్యమైంది? దానికి వారెలా ఒప్పుకున్నారు? ఇంతకీ వారి కధా కమామిషేంటో చూద్దాం రండి..
రెండు సార్లు ప్రేమ..
అది 2017 సంవత్సరం, బస్తర్ జిల్లాకు చెందిన చందు, తోక్పల్ ప్రాంతంలో ఎలక్ట్రికల్ పోల్స్ వేయడానికి వెళ్లినపుడు 21 సంవత్సారాల సుందరి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అలా ఫోన్‌లో మాటల ప్రవాహాం మొదలైంది. అది కాస్త గాఢమైన ప్రేమకు దారి తీసింది. అలా సంవత్సరం గడిచిపోయింది. 2018లో బంధువుల పెళ్లికి హాజరవడానికి వచ్చిన హసీనా అనే అమ్మాయి, చందుకు పరిచయమైంది. ఇంకేముంది, ప్రేమ మీద ప్రేమ అన్నట్లు.. చందు ఈ అమ్మాయిని కూడా ప్రేమించడం మొదలుపెట్టేసాడు. కానీ తన ప్రేమను మాత్రం బయటపెట్టలేదు. చివరికి హసీనానే తన ప్రేమను వ్యక్తం చేసింది. తను ఇప్పటికే సుందరితో ప్రేమలో ఉన్నానని చందు చెప్పినా.. హసినా తన ప్రేమను చంపుకోలేకపోయింది. తనతో మాట్లాడాలని పట్టుపట్టింది. ఇలా ఇద్దరి ప్రేమకు పాత్రుడయ్యాడు చందు.
Must Read ;- సింగిల్ లైఫ్ పూర్తయిందన్న సులగ్న పాణిగ్రాహి

ఇద్దరూ అంగీకరించారు
చందు-హసీనల ప్రేమ విషయం సుందరికి కూడా చెప్పారు. మామూలుగా అయితే చాలా రచ్చ, గొడవ అవుతుంది. కానీ సుందరి వారి ప్రేమను అంగీకరించింది. అలా ముగ్గురూ సయోద్యతో ప్రేమించుకుంటూ ఉన్నారు. కానీ కాలం ఒకేలా ఉండదుగా.. ఒకరోజు హఠాత్తుగా హసీనా చందు ఇంటి ముందు ప్రత్యక్షమైంది. ఇక నీతోనే జీవితం అనేసింది. ఈ విషయం తెలుసుకున్న సుందరి మాత్రం ఊరుకుందా.. తనేం తక్కువ కాదన్నట్లు తను కూడా చందుతో సహజీవనానికి సిద్ధమైంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటుందండోయ్.. వీరు ముగ్గురు వేరుగా సహజీవనం చేయడం లేదు. చందు తల్లిదండ్రలుతో కలిసి ఉండడం ఇక్కడ మరో అద్భుతమైన విషయం.
పెళ్లితో సుభం కార్డు
కందకు లేని దురద కత్తికెందుకో అన్నట్లు.. అన్నింటికీ మేమున్నాం అంటూ సమాజం ఇక తయారైంది వారిని ప్రశ్నించడానికి.. చందు కుటుంబానికి మాటల బాణాలు మొదలయ్యాయి. ఈ గొడవంతటికి పుల్ స్టాప్ పెట్టాలని చందు.. అతని ప్రేయసులు నిర్ణయించుకున్నారు. చివరికి పెళ్లి చేసుకోవాడానికి సుముహూర్తం నిర్ణయించి.. సుందరిని, హసీనాను ఒకే ముహుర్తానికి తన భార్యలుగా చేసుకున్నాడు చందు. వినడానకి, చూడ్డానికి కూడా కాస్త మింగుడు పడని విషయమైనా చేసుకున్న ముగ్గురు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాం అని చెప్పడం కొసమెరుపు..
మేము హ్యాపీ.. మీకేంటి సమస్య..
ఇద్దరు ఒక్కటయ్యే అనిర్వచనీయమైన ఘట్టమే పెళ్లి. కాకపోతే ఇక్కడ కాస్త భిన్నంగా ముగ్గురని ఒక్కటి చేసిన వేదికగా మారింది పెళ్లి. మరి అమ్మాయి వాళ్ల పెద్దలు హాజరయ్యరా లేదా అనుకుంటున్నారా? హసీనా కుటుంబ సభ్యులు వచ్చి ఈ ముగ్గురిని ఆశీర్వదించారు. సుందరి కుటుంబం మాత్రం ఈ పెళ్లికి దూరంగా ఉండిపోయారు. ఈ రోజు వాళ్లు ఈ పెళ్లికి అంగీకరించకపోవచ్చు.. కానీ వారు మారుతారు. నేను సంతోషంగా ఉండడం చూసి వాళ్లే వస్తారనే ధీమా వ్యక్తం చేసింది సుందరి. మేము ముగ్గురం ఒక కుటుంబంగా ఎప్పటికీ కలిసి ఉంటామని వారు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ విచిత్ర వివాహానికి నెటిజన్లు కూడా నోరెళ్లబెడుతున్నారు. ఇలా కూడ చేసుకుంటారా అంటూ తలలు పట్టుకుంటున్నారు. విన్నారుగా.. ఈ పెళ్లి ఎంత విచిత్రంగా అనిపించినా.. ఆ అమ్మాయిల ప్రేమకు మాత్రం హ్యాట్సాఫ్ అనాల్సిందే.. ప్రేమించిన వాడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదన్నట్లున్నారు ఈ ఇరువురు అతివలు. అయినా.. అప్పుడే ఏమైంది.. ఇప్పుడేగా పెళ్లైంది.. భవిషత్తులో ఇంకెన్ని విచిత్రాలు చూపిస్తారో ఈ జంట(లు).
Also Read ;- అకుంటిత దీక్షతో అనుకున్న లక్ష్యం అందుకున్న ‘గరిమా అబ్రాల్’
https://www.youtube.com/watch?v=bgxfMx5S22Q











