సులగ్న పాణిగ్రాహి పేరు వినగానే చక్కని కళ్లతో .. చిక్కనైన నవ్వుతో .. ఆకర్షణీయమైన రూపం కళ్లముందు కదలాడుతుంది. హిందీ సినిమాలు .. టీవీ షోలు .. వెబ్ సిరీస్ లు చూసేవారికి ఆమె సుపరిచితం. 2007 నుంచి 2010 వరకూ టీవీ షోలు చేస్తూ వచ్చిన ఆమె, మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ క్రేజ్ ఆమెను వెండితెరకు పరిచయం చేసింది. 2011లో ‘మర్డర్ 2’ సినిమా ద్వారా ఆమె వెండితెరకి పరిచయమైంది. తనదైన నటనతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వరుసగా తమిళ .. మరాఠీ సినిమాలు చేస్తూ వచ్చిన సులగ్న, ప్రస్తుతం వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది.
అటు బుల్లితెరపై .. ఇటు వెండితెరపై మంచి పేరు సంపాదించుకున్న సులగ్న, ఈ నెల 9వ తేదీన వివాహం చేసుకుంది. కమెడియన్ విశ్వకల్యాణ్ రాత్ జీవితంలోకి అర్థాంగిగా ఆమె ప్రవేశించింది. 2017 నుంచి వెబ్ సిరీస్ లతో విశ్వకల్యాణ్ తీరికలేకుండా ఉన్నాడు. కమెడియన్ గా ఆ వెబ్ సిరీస్ లు ఆయనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారడంతో .. ఆ ప్రేమను వాళ్లు పెళ్లిపీటలవరకూ తీసుకెళ్లారు. తాజాగా సులగ్న తమ పెళ్లి ఫోటోలను .. రిసెప్షన్ ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది.
పెళ్లి కూతురుగా సులగ్న రెడ్ కలర్ లెహంగా .. బ్లు కలర్ దుపట్టా ధరించగా, విశ్వకల్యాణ్ క్రీమ్ కలర్ శార్వాణి వేసుకున్నాడు. రిసెప్షన్ లో సులగ్న రెడ్ కలర్ శారీలో మెరవగా అతను బ్లూ సూట్ లో కనిపించాడు. మా సింగిల్ లైఫ్ పూర్తయింది .. ఇప్పటి నుంచి ‘ఫన్ రైడ్’ మొదలైంది అంటూ సరదాగా ఓ కామెంట్ పెట్టింది. ఈ ఇద్దరి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Must Read ;- విక్రమ్ భట్ ‘అనామిక’ వెబ్ సిరీస్ లో సన్నీలియోన్