యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా.. ఇస్మార్ట్ బ్యూటీ నభానటేశ్, మల్లూ కుట్టి అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటించిన కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అల్లుడు అదుర్స్’ . ‘కందిరీగ, రభస’లాంటి సినిమాలతో మంచి దర్శకుడు అనిపించుకున్న సంతోష్ శ్రీనివాస్ దీనికి దర్శకుడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14 న విడుదల కాబోతున్న ఈసినిమాకి సంబంధించిన ప్రచారం ఊపందుకుంది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదలకు ఇంకా నాలుగు రోజులే ఉండడంతో .. అల్లుడు అదుర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిన్న సాయంత్రం సుమ స్పాంటేనియస్ యాంకరింగ్ తో చాలా గ్రాండ్ గా జరిగింది. పెద్దగా క్రౌడ్ లేకుండా.. బెల్లంకొండ సురేశ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, బంధుమిత్రులు మాత్రమే ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు.
దీనికి ముఖ్య అతిథులుగా మాస్ దర్శకుడు వివి వినాయక్, కామెడీ మాస్టర్ అనిల్ రావిపూడి విచ్చేశారు. సాయిశ్రీనివాస్ తండ్రి , స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ శ్రీనివాస్, ఇందులో ముఖ్యపాత్రలు పోషించిన శ్రీనివాసరెడ్డి, చమ్మక్ చంద్ర, సప్తగిరి, రచ్చరవి, కథానాయిక నభానటేశ్, ఇందులో అదిరిపోయే ఐటెమ్ నెంబర్ కు నర్తించిన మోనాల్ గజ్జర్, ఇంకా లిరిక్స్ రైటర్స్ భాస్కరభట్ల, శ్రీమణి ఈ సినిమా లో తమ పాత్రల గురించి మాట్లాడి.. సినిమా క్రూకి తమ ధన్యవాదాలు తెలిపారు. సినిమా సూపర్ హిట్టవ్వాలని ఆకాంక్షించారు.
ప్రొడ్యూసర్ బెల్లంకొండ శ్రీనివాస్ తన తనయుడు శ్రీనివాస్ ను ఛత్రపతితో బాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ చేస్తున్న సందర్భంగా.. దర్శకుడు , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన వివి వినాయక్ కు పూల మాలతో చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ.. ఇందులో సాయి అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. ఆకలిగా ఉన్న పులిలా రెచ్చిపోయి.. కష్టసాధ్యమైన స్టెప్స్ వేసి అలరించాడు అని అన్నారు. ఇక వివి వినాయక్ చేతుల మీదుగా ‘అల్లుడు అదుర్స్’ ఆడియో బిగ్ సీడీని విడుదల చేశారు. అలాగే లిరిసిస్ట్ భాస్కర్ భట్ల ఈ సినిమాలో తాను రాసిన ‘పడిపోయా పడిపోయా’ అనే సాంగ్ లిరిక్స్ లోని రెండు లైన్స్ పాడివినిపించి అలరించారు. ఇక శ్రీమణి రాసిన స్పానిష్ పదాలతో రాసిన ‘ఓలా చిక్కా’ అనే పాట సందర్భాన్ని వివరించారు.
ఇక నిర్మాతలు గంజి రమేశ్, సుబ్రహ్మణ్యం , బెల్లంకొండ సురేశ్ భార్యల్ని కూడా వేదిక మీదకి పిలిపించడం విశేషం. ఇక ఈ సినిమా మొదటి టికెట్ ను అనిల్ రావిపూడి కొనుగోలు చేశారు. ఇక ఈసినిమా కథ విషయంలో అనిల్ రావిపూడి చాలా సహాయం చేశారని బెల్లంకొండ సురేశ్ చెప్పారు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అనిల్ రావిపూడికి ధన్యవాదాలు తెలిపారు. జనవరి 14న తెలుగు ప్రేక్షకులు ఆరడుగుల ఎనర్జీని తెరమీద చూస్తారని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెలిపారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ .. ఈ సినిమా మంచి హిట్టవుతుందని.. తెలుగు ప్రేక్షకులు సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేస్తారని తెలిపాడు.
Must Read ;- ట్రైలర్ టాక్ : కామెడీ, హారర్, యాక్షన్ ప్యాక్ ‘అల్లుడు అదుర్స్’