దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పేరు వినగానే ‘కందిరీగ’ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో హీరోకి .. విలన్ కి మధ్య సాగే దాగుడుమూతలు నవ్వులు పూయిస్తాయి. ఇద్దరు హీరోయిన్స్ తో హీరో చేసే సరదాలు .. సందళ్లు కళ్లముందు కదలాడతాయి. అంతగా ఆ సినిమా గుర్తుండిపోయేలా చేసిన సంతోష్ శ్రీనివాస్ తాజాగా ‘అల్లుడు అదుర్స్‘ సినిమా చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా థియేటర్స్ కి రానుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడాడు.

‘అల్లుడు అదుర్స్’ టైటిల్ ఎనౌన్స్ చేసినప్పుడు బయటి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కందిరీగ’ మాదిరిగానే ఈ సినిమా నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా సాగుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా నభా నటేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ చేసే సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. లాక్ డౌన్ కి ముందే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను .. పాటలను షూట్ చేశాము. లాక్ డౌన్ కారణంగానే మా సినిమా ‘సంక్రాంతి’ విడుదలకి ఫిక్స్ అయింది. అల్లుడు టైటిల్ తో ఉన్న మా సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతుండటం మాకు మరింత కలిసొచ్చే అంశం.
బెల్లంకొండ సురేశ్ ఫ్యామిలీతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. వాళ్ల బ్యానర్ పై ఇంతకుముందు నేను సినిమాలు చేశాను. ఆ పరిచయం వలన నేను బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా అనుకోలేదు. ఈ కథకి ఆయనైతే సరిగ్గా సెట్ అవుతాడని అనిపించింది. అందువల్లనే నేను వెళ్లి కలవడం .. వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకూ బెల్లంకొండ శ్రీనివాస్ ఎంతో కష్టపడి మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అదే రూట్లో వెళుతూ ఆయనను మరో యాంగిల్ లో చూపించాను. యాక్షన్ .. కామెడీతో పాటు ఎమోషన్ ను కూడా ఎంతో బాగా పండించాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది” అని చెప్పుకొచ్చాడు.
Must Read ;- ‘కందిరీగ 2’ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?











