కన్నడ స్టార్ హీరో యశ్ ‘కేజీయఫ్’ తో ఇండియన్ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా అత్యధిక వసూళ్ళను కురిపించింది. అప్పటివరకు కన్నడ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తుడిచేసి కొత్త రికార్డులను నెలకొల్పాడు యశ్. ఇప్పుడు కేజీయఫ్ – 2 సినిమాతో మన ముందుకు రానున్నాడు యశ్. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ దేశంలో లాక్ డౌన్ విధించడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఈ మధ్యనే తిరిగి ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ముఖ్యమైన నటీనటులపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు చిత్ర బృందం.
ఈ సినిమాపై యశ్ అభిమానులతో పాటుగా సాధారణ ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని తర్వాత యశ్ ఏ దర్శకునితో సినిమా చేస్తాడు అన్నది మాత్రం ఇప్పటి వరకు కన్ఫామ్ కాలేదు. అయితే ఈ హీరో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ఆమధ్య వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పుడు మరోసారి ‘కేజీయఫ్ – 2’ తర్వాత యశ్ చేయబోయే సినిమాపై కోలీవుడ్ సినీ వర్గాల్లో ఒక లేటెస్ట్ గాసిప్ చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే యశ్ తన తదుపరి సినిమా సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ తో ఉండనుందని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే శంకర్ ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసాడని, ఆ కథను డైరెక్టర్ శంకర్, యశ్ కు వినిపించాడని, యశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియాగా తెరకెక్కనుందని టాక్. ఈ వార్త నిజమై ఈ కాంబినేషన్ కనుక సెట్టయ్యి స్ట్రాంగ్ కంటెంట్ పడితే మాత్రం మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే మరి.