బిగ్ బాస్ 4 ఫైనల్ దగ్గర పడుతున్న కొద్దీ.. విన్నర్ గా ఎవరు నిలుస్తారనేది ఆసక్తిగా మారడంతో పాటు గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా ఎవరు వస్తారనేది కూడా మరింత ఆసక్తిగా మారింది. ఫైనల్ ఎపిసోడ్ అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అందుచేత అంచనాలకు తగ్గట్టుగా ఉండేలా ఈ ఎపిసోడ్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది మా టీవీ. ఇక గెస్ట్ విషయానికి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు గట్టిగా వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే.
అందుచేత ఈసారి మహేష్ బాబును గెస్ట్ పిలవనున్నారని వార్తలు వచ్చాయి. మహేషే ఫిక్స్ అనుకున్నారు. అయితే.. ఇప్పుడు మహేష్ బాబు కాకుండా.. చిరంజీవి, ఎన్టీఆర్ పేర్లు తెర పైకి వచ్చాయి. చిరంజీవి లాస్ట్ సీజన్ కి గెస్ట్ గా వచ్చారు కాబట్టి ఈసారి రాకపోవచ్చు అనుకున్నారు కానీ.. అనూహ్యంగా చిరంజీవి పేరు ప్రచారంలోకి రావడం ఆసక్తిగా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. అయితే.. ఎన్టీఆర్ జెమిని టీవీకి ఓ రియాల్టీ షో చేస్తున్నారు. అందుచేత ఎన్టీఆర్ బిగ్ బాస్ ఫైనల్ కి గెస్ట్ రాకపోవచ్చు అంటున్నారు.
ఏది ఏమైనా… చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్.. ఈ ముగ్గురులో ఒకరు గెస్ట్ గా రానున్నారని సమాచారం. మరో విషయం ఏంటంటే.. ఈ ఫైనల్ ఎపిసోడ్ లో నాగార్జున కొంత మంది హీరోయిన్స్ తో కలిసి డ్యాన్స్ చేస్తారట. ఈసారి నాగ్ తో బిగ్ బాస్ స్టేజ్ పై డ్యాన్స్ చేసే ఛాన్స్ ఎవరకి వస్తుందో చూడాలి. ఇక విన్నర్ విషయానికి వస్తే.. అభిజిత్ పేరు వినిపిస్తోంది. అభిజిత్ స్ట్రాంగ్ కంటెస్టంట్. అతనే విన్నర్ అని ప్రచారం జరుగుతుంది. మరి.. అందరూ అనుకున్నట్టుగా అభిజితే విన్నర్ గా నిలుస్తాడో లేక వేరే కంటెస్టంట్ విన్నర్ గా నిలుస్తారో ఈ నెల 20న తెలుస్తుంది.
Must Read ;- బిగ్ బాస్ లో విజయ్ దేవరకొండ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడో తెలుసా.?