బిగ్ బాస్ 4 విజేత మీద ఇప్పటికే జనం ఓ అంచనాకు వచ్చేశారు. విజేత అభిజిత్ అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. విజేత ఎవరో తెలియడానికి ఇంకా మూడు వారాల గడువు ఉంది. ఈలోగా ఏమైనా జరగొచ్చు. విజేత అభిజిత్ అని తెలిస్తే షో మీద ఇంట్రస్ట్ కూడా సన్నగిల్లుతుంది. అందువల్ల ఇంట్రస్ట్ క్రియేటవ్వాలంటే బిగ్ బాస్ ఏదో ఒక మిరాకిల్ చేయక తప్పదు. ఇప్పటికే 44. 94 శాతం ఓట్లతో అభిజిత్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. పైగా జనం దృష్టిలో కూడా రాముడు మంచి బాలుడు తరహాలో పేరు తెచ్చుకున్నాడు.
మరో పక్క టాస్క్ ల విషయంలో విఫలమవుతున్నాడన్న టాక్ ఉంది. హారిక 7.21 శాతం ఓట్లతో చివరి స్థానంలో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. హౌస్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. అభిజిత్, అఖిల్, మోనాల్, అవినాష్, సోహైల్, అరియానా, హారికలు రంగంలో ఉన్నారు. ఎప్పుడో బయటికి వచ్చేస్తుందనుకున్న మోనాల్ అంత తేలికగా బయటికి వచ్చేలా కనిపించడం లేదు. టైటిల్ రేసులో అభిజిత్, అఖిల్ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ఫస్ట్ లెవల్ లో విజయం సాధించి రెండో లెవల్ కి అభిజిత్, సోహైల్, అఖిల్, హారిక అర్హత సాధించారు.
ఈ పోటీ ఇలా ఉంటే తమ కుమారుడు కప్ సాధించేశాడన్న ఆనందంలో అభిజిత్ తల్లిదండ్రులు ఉన్నారు. అతనికి స్వాగత సన్నాహాలు చేస్తున్నారట. సోషల్ మీడియాతో పాటు బయట పబ్లిక్ కూడా అభిజిత్ పేరే చెబుతున్నారు. కప్ అతనే సాధిస్తాడని కూడా అంటున్నారు. అలాగని మిగతావారిని అంత తేలికగా తీసి పారేయలేం. ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఈ వ్యవహారం ఇలా ఉంటే బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తెరతీశాయి. మొదట అభిజిత్ వైపు మొగ్గుచూపిన అతను ఆ తర్వాత యూ టర్న్ తీసుకోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది.
తన ఇంటర్వ్యూల ద్వారా అసలు హౌస్ లో ఏంజరుగుతోందన్న విషయాలను కూపీ లాగుతున్నాడు. మొదట అతను నోయల్ వైపు మొగ్గు చూపాడు. ఆ తర్వాత సోహైల్, అరియానా, అభిజిత్ లకు మద్దతు తెలిపాడు. విజేత అభిజిత్ అని ప్రకటించిన రాహుల్ సడన్ గా ప్లేటు ఫిరాయించాడు. తాజాగా సోహైల్, అరియానాలకు మద్దతు ప్రకటించాడు. ఇది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. అతని చర్యల మీద కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. విజేత విషయాన్ని పక్కన పెట్టి టాప్ 2లో ఎవరెవరు ఉంటారనే బెట్టింగులు కూడా ఎక్కువయ్యాయి. అఖిల్, సోహైల్, హారికల పేర్లు కొందరి నోళ్లలో నానుతున్నాయి.
Must Read ;- ఆ నలుగురిలో తోపులెవరు.. బయటికి తోసేదెవరిని?











