బిగ్ బాస్.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సోషల్ మీడియాలో అయితే.. బిగ్ బాస్ విన్నర్ గురించే చర్చ. అయితే.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వారందరికీ రెమ్యూనరేషన్ ఉంటుందనే విషయం తెలిసిందే. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వాళ్లకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు.? అందరికీ ఒకే రకమైన రెమ్యూనరేషన్ ఉంటుందా.? లేక ఒక్కొక్కరికి ఒక్కొలా రెమ్యూనరేషన్ ఉంటుందా.? అంటే.. ఈ హౌస్ లో పాల్గొన్న వారి పాపులారిటీ, గ్లామర్ ని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుందని తెలిసింది. ఈ రెమ్యూనరేషన్ విషయంలో బేరాలు కూడా జరుగుతాయి.
హౌస్ లో ఎన్ని వారాలు ఎక్కువుగా ఉంటే.. అంత ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మోనాల్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ విషయం ఏంటంటే.. మోనాల్ కి వారానికి మూడున్నర లక్షలు రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారని తెలిసింది. ఈ లెక్కన ఓ యాభై లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ దక్కింది. బిగ్ బాస్ విన్నర్ కి దక్కేది యాభై లక్షలే. అంటే.. మోనాల్ బిగ్ బాస్ విన్నర్ కాకపోయినా.. విన్నర్ కి వచ్చే అమౌంట్ మోనాల్ దక్కించుకుంది. విన్నర్ అయ్యుంటే.. ఇంకా బహుమతులు వచ్చేవి.
గతంలో మోనాల్ కొన్ని సినిమాల్లో నటించింది. అయితే..ఆ సినిమాలు ఆశించిన స్ధాయిలో సక్సస్ కాకపోవడంతో ఆమెకు అవకాశాలు రాలేదు. కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చింది. ఈ టైమ్ లో బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టైమ్ లో రెండు సినిమాలు చేసినా.. యాభై లక్షలు వచ్చేవి కాదు. బిగ్ బాస్ పుణ్యమా అని మోనాల్ పాపులర్ అయ్యింది. ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు రావచ్చు. మరి.. అదే కనుక జరిగితే.. మోనాల్ కోరుకున్నట్టుగా హీరోయిన్ గా రాణిస్తుందేమో చూడాలి.
Must Read ;- బిగ్ బాస్ లో విజయ్ దేవరకొండ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడో తెలుసా.?