రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ‘బిగ్ బాస్ 4’ రియాల్టీ షో విజేత అభిజిత్. ఈ సందర్భంగా అభిజిత్ మాట్లాడుతూ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని ‘బిగ్ బాస్ 4’ రియాల్టీ షో విజేత గా నిలిచిన సందర్భంగా ఏదైన మంచి కార్యక్రమం చేయాలి అన్న ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది అన్నారు.
ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని మనందరం నియంత్రించాలని అందుకోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తనతోపాటు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సోహెల్, హారిక , కళ్యాణి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో MLC శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: బిగ్ బాస్ విషయంలో.. వర్మ శ్రీకాంత్.. ఇద్దరిలో ఎవరి జోస్యం ఫలిస్తుంది.?
#BiggBossTelugu4 winner @Abijeet accepted #GreenindiaChallenge
With the inspiration of @MPsantoshtrs and Planted 3 saplings.Further nominated @RyanSohel @harika_alekhya @Karate_Kalyani and all his fans who voted in #BigBoss4 to plant 3 trees & continue the chain. pic.twitter.com/zaMzKanhnb
— Xappie® (@XappieWorld) December 22, 2020