బిగ్ బాస్ సీజన్ 5 కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కరోనా పరిస్థితులు ఉన్నా బిగ్ బాస్ 4ను విజయవంతంగా కొనసాగించారు. కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని గత ఏడాది ఎలా కొనసాగించారో ఈసారి కూడా అలాగే నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ముగింపు దశకు చేరుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చురుకుగా కొనసాగుతోంది.
అందుకే త్వరలోనే ఈ షోను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కినేని నాగార్జున హోస్ట్ గా నిర్వహించే ఈ షో ఇప్పటికే ప్రారంభం కావలసి ఉంది. వేసవిలో ప్రారంభించాలని స్టార్ మా భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. పరిస్థితులు సద్దుమణుగుతున్న దృష్ట్యా దీని మీద దృష్టిపెట్టారు. ఇందులో పాల్గొనబోయే వారిని జూమ్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తున్నట్లు సమాచారం.
10 రోజుల్లో ఈ ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తవుతుంది. వారందరికీ వ్యాక్సినేషన్, క్వారంటైన్ లాంటి కార్యక్రమాలను పూర్తిచేసి షోను ప్రారంభించాలని నిర్వాహకులు యోచిస్తున్నారు. ఈసారి ప్రైజ్ మనీని పెంచబోతున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఈసారి కంటెస్టెంట్లు ఎవరన్నదాని మీద వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Must Read ;- జూలై లో మొదలు కాబోతున్న ‘బిగ్ బాస్’ సీజన్ 5