గ్రేటర్ ఎన్నికల్లో పోటే చేస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. కార్యకర్తల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ కూడా పోటీచేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన కూడా జారీ చేశారు. రెండు పార్టీల మధ్య పొత్తు అంశాన్ని పరిశీలిస్తామని జనసేనులు తెలిపినా ఆ పార్టీతో సంప్రదింపులు జరపకుండానే బీజేపీ ఎన్నికల అభ్యర్థుల లిస్టును ప్రకటించడం పలు చర్చలకు దారితీస్తోంది.
అయితే బీజేపీతో జనసేనకు ఉన్న దోస్తీ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీచేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో వెళ్లేందుకు జనసేన రాష్ట్ర నాయకత్వం కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తమ అధ్యక్షుడిదే తుది నిర్ణయమని తెలంగాణ రాష్ట్ర నేతలు ప్రకటించారు. ఈ రెండు పార్టీల మధ్య చర్చల అనంతరం ఈవిషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఈ లోపే బీజేపీ పార్టీ ఎన్నికల అభ్యర్థుల జాబీతాను ప్రకటించే పనిలో ఉంది. ఈరోజు సాయంత్రంలోగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు పేర్కొన్నది. అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీతో పొత్తుకు సుముఖత వ్యక్తం చేసినప్పుడు ఆ పార్టీతో కనీసం సంప్రదించి ఎవరెన్ని స్థానాలకు పోటీ చేయాలనే అనే అంశాలు చర్చించాల్సి ఉంటుంది. అలా కాకుండా పొత్తు విషయం గురించి జనసేన పార్టీతో సంప్రదించకుండానే అప్పుడే అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించడమేంటని జనసేన కార్యకర్తలు బీజేపీ పార్టీ వైఖరిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తమ నేత పవన్‌కళ్యాణ్ అంటే బీజేపీ నేతలకు అంత చిన్నచూపా? అని ప్రశ్నిస్తున్నారు.
Must Read ;- గ్రేటర్ ఎన్నికల రంగంలోకి దిగుతున్న అమిత్‌షా, జెపీ నడ్డా?