రాయలసీమ అభివృద్ధి చేస్తానంటూ ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన నీటిమీద రాతలుగా మారాయా ? సిఎం గా జగన్ సొంత గడ్డకు చేసింది ఏమిటి ? తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ నిజంగా రైతులకు మేలు చేస్తున్నాడా ? వైసీపీ ప్రభుత్వ తీరుతో కరువు ప్రాంతంలో రైటన్నలు పడుతున్న ఇబ్బందులు ఏమిటి ? జగన్ ఇలాఖాలో పాగా వేసేందుకు బిజెపి రచిస్తున్న వ్యూహాలు ఏమిటి ?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ ప్రజలకు వందలాది హామీలు గుప్పించిన జగన్ ప్రజల్లో అనేక ఆశలు రేకెత్తించాడు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజల కష్టాలు తీరుస్తానని, వలసలు లేకుండా చేస్తానని, నిరుద్యోగ ఉపాధి కల్పనకోసం పరిశ్రములు తీసుకొస్తానని, నత్తనడకన సాగుతున్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపధికన పూర్తిచేయడమే తన మొదటి ప్రాధాన్యత అంటూ ప్రజలను నమ్మబలికాడు జగన్. అదేసమయంలో తన వందిమాగతులతో సీమకు అన్యాయం జరిపోతోందంటూ గగ్గోలు పెట్టించి తాను అధికారంలోకి వస్తే ఈ కష్టాలన్నీ తీరుస్తానంటూ మభ్య పెట్టాడు.అదేసమయంలో రాయలసీమ వాదం పేరుతో యువత, విశ్వవిద్యాలయాలే కేంద్రంగా 2019 ఎన్నికల సమయంలో ఓ సెంటిమెంట్ ని రాజేశాడు.ఈ అంశాలన్నీ అక్కడి సెంటిమెంట్ ను ఓట్ల రూపంలో తనకు అనుకూలంగా మారులచుకోవాలనేదే జగన్ అప్పటి వ్యూహం.అయితే జగన్ మోసపూరిత మాటలు నీటిమీద రాతలే అని గుర్తించలేని సీమ ప్రజలు పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు మరియు ఫ్యాక్షన్ రాజకీయాలకు అతీతంగా, చరిత్రలో మొదటిసారి సీమలోని 52 అసెంబ్లీ స్థానాలకు గాను, 49 స్థానాలను ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడుఏళ్ళు పూర్తి అవుతున్నా రాయలసీమ ప్రాంతంలో సమస్యలు ఎక్కడా పరిష్కరించలేదు. ఆ దిశగా కనీస చర్యలు ప్రారంభించిన దాఖలాలు కనిపించడం లేదు.కరువు సీమలో “డ్రిప్” విధానం కారణంగా సిరులు పండిస్తున్న సీమప్రజానీకానికి ఇచ్చే రాయతీలను జగన్ సర్కార్ తొలగించేసింది.కాగా రాయతీతో కూడిన పనిముట్లు రాకపోవడంతో అక్కడి రైతులకు వ్యవసాయం పెనుభారంగా మారింది.ఇదిలా ఉంటే సీమలో తన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టుల నిర్మాణాలను సైతం పట్టించుకోకుండా జగన్, వైఎస్ ఆశయాలను తుంగలో తొక్కాడు.
ఇక కడప-బెంగళూరు మధ్య 300 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణాలకు మొగ్గుచూపుతూ నిర్మాణాలను కేంద్రం వేగవంతం చేస్తోంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మాత్రం రైల్వేలైన్ పనులకు సంబంధించిన భూసేకరణలాంటి అంశాలలో కనీస సహకారం అందించకుండా వాటిని కేవలం 70 కిలోమీటర్ లకే పరిమితం చేశారు. దీంతో కడప-బెంగళూరు రైల్వేలైన్ ముదిగుబ్బ రైల్వేలైన్ కు అనుసంధానం చేస్తే రైలు కూత వినచ్చన్న రాయచోటి మరియు పీలేరు ప్రజలు చిరకాల స్వప్నానికి జగన్ ప్రభుత్వం చరమగీతం పాడినట్లు అయ్యింది.ఇదిలా ఉంటే నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తనవైపు నుంచి ఆర్ధిక సహకారం అందిస్తున్నప్పటికీ దానిని అందుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజానికి రాయలసీమకు కరువు కోరల నుండి విముక్తి కలగాలంటే పోతిరెడ్డిపాడు విస్తరణే శరణ్యమని 1985లో నాటి బి.జే.పి రాష్ట్ర అధ్యక్షుడు, నేటి దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేతృత్వంలో చేపట్టిన ఉద్యమం కానీ,శాంతి కోసం – నీటి కోసం అనే నినాదంతో 1994లో స్వర్గీయ చిలకం రామచంద్రారెడ్డి నాయకత్వంలో చేపట్టిన సుధీర్గ పాదయాత్ర,అదేవిధంగా 1998లో జరిగిన గోదావరి జలాల మళ్లింపు, గాలేరు-నగరి, హంద్రి-నీవ ప్రాజెక్టుల నిర్మాణం కొరకు నాటి సీమ నాయకులు విడతల వారిగ చేసిన పోరాటాలు మారువలేనివి.ఈ పోరాటాల స్పూర్తితోనే నాటి ముఖ్యమంతి యన్.టి.ఆర్ ప్రభుత్వం నుండి వై.యస్. రాజశేఖర్ రెడ్డి హయాం వరకు సీమ ప్రాంతంలోని ప్రాజెక్టులలో పురోగాభివృద్ధి జరిగిందనేది వాస్తవం.
ప్రస్తుతం జగన్ ఆ స్పూర్తిని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడాని ఖచ్చితంగా చెప్పవచ్చు.వైసీపీ అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లో పింఛా, అన్నమయ్య డ్యాంలు రెండుసార్లు కొట్టుకుపోవడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఇక తాజాగా, వచ్చే వరదను అంచనావెయ్యలేకపోవడం , ఇసుక బకాసురుల స్వార్ధం కారణంగా 33 మంది అమాయక రైతుల ప్రాణాలు వరదకు బలైపోయాయి.ఇక కోట్లాది రూపాయలు విలువ చేసే పంట చేతికి అందివచ్చినా.. ప్రకృతి వైపరీత్యాలకు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.దీంతో అనేకమంది పేదలు నిరాశ్రయులయ్యారు.అయితే వారిని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.వరదల్లో గూడు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వమే నేరుగా 3 నెలల్లో ఇల్లు పూర్తి చేసి, తాళాల గుత్తి వారి చేతిలో పెడతాను అని జగన్ హామీ ఇచ్చారు. ఆ ఘోర వైపరీత్యం జరిగి నేటికీ నాలుగు నెలలు గడుస్తున్నా బాధితులకు ఇళ్ళు అంశంలో కనీసం కదలిక లేదు.దీంతో గూడు కోల్పోయిన బడుగు వర్గాల ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, ఏటి సెగకు గర్బిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు వడదెబ్బకు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతంగా మారాయి.
ఇదిలా ఉంటే జగన్ సొంత జిల్లాలో వరద బాధిత కుటుంబాలకు నామ మాత్రంగా కేవలం 5 లక్షల పరిహారం చెల్లించి, చేతులు దులుపుకోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ముఖ్యంగా ఎల్.జి. పాలిమర్స్ మృతులకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి గొప్పలు చెప్పుకున్న జగన్ వరద బాధితుల విషయంలో ద్వంద వైఖరి ప్రదర్శించారనే వాదన వినిపించింది. ఒకరికి ఎక్కువ ఇంకొకరికి తక్కువ ఇవ్వడం ద్వారా, జగన్ కి రైతుల పక్షాన వున్నచులకన భావన ఏంటో ప్రజలకు అర్ధమయింది.
ఈ క్రమంలో ఈ అంశాలు అన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి సీమ ప్రాంతానికి జగన్ చేస్తున్న అన్యాయం పై ప్రజల్లో చైతన్యం కల్పించాలని బిజెపి ఆలోచనలు చేస్తోంది. అందులో భాగంగానే రాయలసీమ నడిబొడ్డున అందులోనూ జగన్ ఇలాఖా అయిన కడపలో ఈ నెల 19 వ తేదిన “రణభేరి“ అనే భారీ సభ నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.మదపటేనుగులా ప్రవర్తిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ఉధ్యమమనే అంకుశంతో నిద్రలేపుదాం! ఓటుబ్యాంకు రాజకీయాలను కట్టడిచేద్దాం ! అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ రణభేరి వేధికాగా ప్రధానమంత్రి మోడీ రాయలసీమ ప్రాంతాభివృద్ధి మీద నిబద్ధతను చాటిచెప్పాలని బిజెపి శ్రేణుల ఆలోచన చేస్తున్నట్లులుగా అర్ధం అవుతోంది.అదేసమయంలో జగన్ తాను పుట్టిన గడ్డకు ఎంత అన్యాయం చేస్తున్నాడో ప్రజలకు వివరించేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Must Read:-జగన్ వెళ్లి మోడీ దగ్గర మెడలు ఒంచుతాను అన్నాడు కేంద్రానివి కాదు | Common Man Fires On AP CM Jagan