దక్షిణాది సినిమాకి పాన్ ఇండియా కలర్ తీసుకొచ్చిన దర్శకుడు శంకర్. మిగతా దర్శకులంతా ఆ తర్వాత వచ్చిన వారే. భారతీయుడు, రోబో సినిమాలతో శంకర్ గ్రాఫ్ ఎలా పెరిగిందో అందరికీ తెలుసు. ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వెల్ చేస్తున్నారు శంకర్. తాజా వార్త ఏమిటంటే రామ్ చరణ్ హీరోగా నటించే ఓ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించనున్నారనే మాట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇది మల్టీస్టారర్ సినిమా. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‘ఆచార్య’లో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా మళ్లీ ఏ సినిమా తెరకెక్కబోతోందన్న సస్పెన్స్ కు తెరపడినట్టే. ఎందుకంటే ఓ పక్క ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సినిమా ప్రశాంత్ నీల్‌తో ఉంటుందని అధికారికంగా ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో రామ్ చరణ్ సినిమాల సంగతి ప్రశ్నార్థకమైంది. చేస్తే ఓ పాన్ ఇండియా చేయాల్సిందే.
అందుకే ఇందుకు శంకర్ ను ఎంచుకున్నట్లు సమాచారం. అది శంకర్ సినిమా అన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. హీరోగా ఇది రామ్ చరణ్ కు 15వ సినిమా అవుతుంది. ఈ కాంబోలో సినిమాని దిల్ రాజు నిర్మించనున్నారు. నిజానికి శంకర్ తో ఇంతకుముందే సినిమా చేయాల్సి ఉన్నాఅది కుదరలేదు. అసలు భారతీయుడు 2 దిల్ రాజే నిర్మిస్తారని వార్తలు కూడా వచ్చాయి. ఎస్ వీసీ బ్యానర్ లో ఇది 50 వసినిమా అవుతుంది. ప్రేమకులరోజు సందర్భంగా ఈ నెల 14న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. రామ్ చరణ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అధికారికంగా కూడా ఈ విషయాన్ని ప్రకటించారు.
Excited to be a part of Shankar Sir's cinematic brilliance produced by Raju garu and Shirish garu.
Looking forward to #RC15 ! @shankarshanmugh @SVC_official #SVC50 pic.twitter.com/SpjOkqyAD4
— Ram Charan (@AlwaysRamCharan) February 12, 2021
Must Read ;- జెర్సీ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన చరణ్?











