లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీలో విడుదలైన ‘రాత్ అకేలీ హై’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది రాధికా ఆప్టే. అందులో ఆమె భర్తను చంపిన నేరస్తురాలిగా బాగా నటించింది. ఇప్పుడు మరోసారి అలాంటి ఓ క్రైమ్ స్టోరీతోనే ఓ సినిమా చేయబోతోంది ఆమె. సినిమా పేరు ‘మిసెస్ అండర్ కవర్’. ఇందులో ఆమె గృహిణిగా నటిస్తోంది. అదే సమయంలో ఆమె అండర్ కవర్ కాప్ గానూ మెప్పించబోతోంది. గరిట పట్టాల్సిన ఓ మహిళ కి . రివాల్వర్ ను బొడ్లో దోపుకోవాల్సిన పరిస్థితి ఎందుకేర్పడింది? అనే కథాంశంతో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హోలీ సందర్భంగా రాధికా ఆప్టే తన ఆఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విడుదల చేసింది.
రాధిక అప్టే .. రివాల్వర్ ను తన చీరలో దోపుకొనే ఈ స్టిల్ .. చాలా కొత్తగా అనిపిస్తోంది. కిల్ ఇన్ ది కిచెన్ థీమ్ తో రివీలైన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేడీ ప్రొడ్యూసర్ అండ్ రైటర్ అనుశ్రీ మెహతా ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ఇక సినిమా కోల్ కత్తా నేపథ్యంలో సాగుతుందట. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనుంది.
Also Read:న్యూ పోస్టర్ : మహిళలతో ‘వకీల్ సాబ్’
An Indian housewife with a gun is one deadly combination, ain't it?
Presenting the first look poster of my next film, a Spy- Entertainer that has me in & as #MrsUndercover!@vyas_sumeet #RajeshSharma @anushreeAmehta @AbirSenguptaa @vaarunbajaj @B4UMotionPics pic.twitter.com/6HmOwItI1C— Radhika Apte (@radhika_apte) March 28, 2021