బెజవాడ దుర్గగుడి కొత్త ఈవోగా డి.భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. సురేష్ కుమార్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం, నూతన ఈవోగా భ్రమరాంబను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాజమహేంధ్రవరం ఆర్‌ఏసీగా పనిచేస్తున్న డి.భ్రమరాంబ దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. సురేష్ బాబును రాజమహేంద్రవరం ఆజేసీగా బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దుర్గగుడిలో తవ్వేకొద్దీ అవినీతి ఊటలు..
దుర్గగుడిలో రెండేళ్ల నుంచి అవినీతిపై మీడియా పోరాడుతూనే ఉంది. దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఈవోగా పనిచేసిన సురేష్ బాబుపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై విజిలెన్స్, ఏసీబీ అధికారులు పలు దఫాలుగా సోదాలు నిర్వహించారు. 15 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. అయినా అవినీతి ఆగిన దాఖలాలు లేకపోవడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఇప్పటికే దుర్గగుడిలో జరుగుతున్న అవినీతిపై ఓ నివేదికను ప్రభుత్వానికి అందించారు. తీవ్ర అవినీతి ఆరోపణలు నిజమని తేలడంతో ఈవో సురేష్ బాబుపై బదిలీ వేటు పడింది.
ALSO READ:తవ్వేకొద్దీ దుర్గగుడిలో అక్రమాలు.. విజిలెన్స్ షాక్










