Can Jai Bhim Recreate History At Golden Globes
హీరో సూర్య నటించిన ‘జైభీమ్’ సినిమాకు ఇటీవల కాలంలో ఎంతటి ప్రశంసలు దక్కాయో అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమా ఎన్ని అవార్డులు కొల్లగొడుతుందో చూడాలి. ముఖ్యంగా ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు అతి సమీపంలో ఉంది. ఇది ఎంతో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ 1943లో దీన్ని ఏర్పాటు చేసింది. తొలి అవార్డును 1944 జనవరి 20న ప్రదానం చేశారు. ఈ అవార్డుకు ఇప్పుడు ‘జైభీమ్’ సినిమా నామినేట్ అయ్యింది.
2022 ఆంగ్లేతర భాషా చిత్రాల విభాగంలో ఈ సినిమా నామినేట్ అయ్యింది. దీంతో పాటు సర్దర్ ఉదమ్, బహత్తర్ హూరైన్, పెబుల్స్, పోర్ట్రెయిట్స్ ది’, ‘ఎట్ అనదర్ రివర్ ’ చిత్రాలు పోటీలో ఉన్నాయి. గతంలో విదేశీ చిత్రాల విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డుకు కొన్ని ఇండియన్ సినిమాలు మాత్రమే వెళ్లాయి. వాటిలో సత్యజిత్ రే ‘ది వరల్డ్ ఆఫ్ అపు’, రిచెర్డ్ అటెన్ బరో ‘గాంధీ’, మీరా నాయర్ ‘సలామ్ బాంబే’ ఉన్నాయి. 2002లో మీరానాయర్ దర్శకత్వం వహించిన మాన్ సూన్ వెడ్డింగ్ కూడా నామినేట్ అయ్యింది.
Can Jai Bhim Recreate History At Golden Globes
ఒక్క సినిమాకే ఆ అవకాశం
ఇన్ని సినిమాలు ఈ అవార్డుకు నామినేట్ అయినా దక్కింది మాత్రం ఒక్క సినిమాకే. అదే ‘గాంధీ’ చిత్రం. ఆ తర్వాత వి. శాంతారామ్ సినిమా ‘దో ఆంఖేన్ బరాహ్ హాత్’ మాత్రం శామ్యూల్ గోల్డ్ విన్ అంతర్జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇంతవరకు మరే సినిమా కూడా గోల్డెన్ గ్లోబ్ అవార్డును మాత్రం గెలుచుకోలేదు. ఇప్పుడు ఆ ఆశలు జైభీమ్ సినిమా మీదే ఉన్నాయి. ఎందుకంటే ఐఎండీబీ టాప్ రేటెడ్ చిత్రాల జాబితాలో దీనికి అత్యధిక రేటింగ్ దక్కింది. అంతకుముందు ఐఎండీబీలో అగ్రస్థానంలో ఉన్న ది షషాంక్ రిడమ్షన్, ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ది గాడ్ ఫాదర్ చిత్రాలను వెనక్కి నెట్టేసింది.
టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘జై భీమ్’ సినిమా ఓ ధనవంతుల ఇంట్లో జరిగిన దొంగతనం అనే చిన్న అంశంతో ప్రారంభమవుతుంది. చివరికి ఇది ఆ నేరంలో అక్రమంగా చిక్కుకున్న గిరిజనులను ఎలా ఇబ్బందులు పెట్టింది? ఓ న్యాయవాది వారికి అండగా నిలబడి ఏం చేశాడు? అన్నదే ప్రధాన కథ. వాస్తవ గాథ ఆధారంగా ఇది తెరకెక్కింది. గాంధీ సినిమా తర్వాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు మరే భారతీయ చిత్రానికీ దక్కలేదు. ఒకవేళ ‘జైభీమ్’కు ఈ అవార్డు దక్కితే మాత్రం గాంధీ తర్వాత స్థానం జైభీమ్ కే దక్కినట్లు అవుతుంది. ఇది 79వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు. వచ్చే జనవరి 9న ఈ అవార్డును ప్రకటించనున్నారు. అప్పటి దాకా మనం ఎదురుచూడాల్సిందే. జైభీమ్ కు కచ్చితంగా ఈ అవార్డు దక్కుతుందని భావిస్తున్నారు.
Must Read ;- సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు.. చిత్ర పరిశ్రమకు ఊరటేనా?











