కరోనా సెకండ్ వేవ్‌తో జనం బెంబేలెత్తిపోతున్నారు.మరోవైపు ప్రభుత్వం సరఫరా చేసే టీకాలు ఇప్పట్లో అందరికీ అందే పరిస్థితి లేకపోవడంతో,ఇక బ్లాక్ మార్కెట్ దందా మొదలైంది.గుంటూరు జిల్లా నరసరావుపేటలో బ్లాకులో కరోనా టీకాలు విక్రయిస్తున్న కోరుగుంట్ల శ్రీను శ్రీనివాసరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.అతని వద్ద నుంచి 50 కోవాగ్జిన్ టీకాలు,20 కోవీషీల్డ్ టీకాలు స్వాధీనం చేసుకున్నారు.నరసరావుపేటలోని అరండల్‌పేటలో ఓ హోటల్లో అక్రమంగా నిల్వ చేసి ఒక్కో టీకాను రూ.2 వేల నుంచి రూ.5 వేలకు బ్లాకులో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ప్రభుత్వ సిబ్బంది నిర్వాకమే..
బ్లాకులో కరోనా టీకాలు విక్రయిస్తున్న కోరుగుంట్ల శ్రీనివాసరావు కోటప్పకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడని తెలుస్తోంది.ప్రజలకు ఉచితంగా వేయాల్సిన టీకాలను పక్కదారి పట్టించి బ్లాకు మార్కెట్‌కు తరలించినట్టు పోలీసులు గుర్తించారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న 70 టీకాలతో పాటు ఇంకా ఏమైనా అతని వద్ద నిల్వ ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది.అసలే టీకాలు దొరక్క ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఏపీలో కరోనా టీకాల బ్లాక్ మార్కెట్ దందా వెలుగులోకి రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- ఆనందయ్య కరోనా మందుపై ఐసీఎంఆర్ అధ్యయనం










