ఏపీ రాష్ట్ర సిఎం అనే గానీ.. ఆయన ఎన్నో కేసులలో నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన మాత్రమే కాదు.. వైయస్సార్ నాయకుడు విజయసాయి రెడ్డి కూడా అన్ని కేసులలో జగన్‌కు తోడున్న సంగతి కూడా తెలిసిన విషయమే. ఇటీవల అరబిందో, హెటిరో భూ కేటాయింపులకు సంబంధించిన ఛార్జీషీట్ నాంపల్లి కోర్టు నుండి ఈడీ కోర్టుకు బదిలీ చేశారు. ఆ కేసుల ఛార్జీషీట్ ను ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు జగన్ న్యాయవాదులు. సిబిఐ కోర్టులోనే చార్జీషీట్ దాఖలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా జగన్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తీర్పు అనుకూలంగా రావడంతో అన్ని చార్జీషీట్లు సిబిఐ కోర్టుకు బదిలీ అయ్యాయి. దీంతో సిబిఐ కోర్టు తాజాగా కొత్త నంబర్‌తో సమన్లు జారీ చేసింది.
జగన్, విజయసాయి రెడ్డిలతోపాటు హెటిరో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకు సమన్లు జారీ చేసింది ఈడీ కోర్టు. ఈ నెల 11న స్వయంగా హాజరు కావాలని కోరింది. మరోవైపు 11న నెల్లూరులో అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పథకం వాయిదా వేస్తారో.. లేక పథకం సాకును చూపి వ్యక్తగత మినహాయింపు కోరుతారో చూడాలి.
Must Read ;- సీఎం జగన్‌తో పీకే భేటీ: రాజకీయ వ్యూహాల కోసమేనా?