వైసీపీ రెబల్ నాయకుడు రఘురామ కృష్ణంరాజు జగన్ తప్పులను ఎత్తి చూపుతూ అనునిత్యం ప్రభుత్వానికి పంటి కింద రాయిలా తయారయ్యారు. ఏ చిన్న పొరపాటు జరిగినా జగన్ గమనించుకోవాలి అంటూ వెంటనే ప్రెస్ మీట్‌కి సిద్ధమైపోతారు. అటువంటి రెబల్ నేత.. జగన్‌కు థ్యాంక్స్ అంటున్నారు. ట్విట్టర్ వేదికగా అధికారకంగా తన కృతజ్ఞతలను తెలియజేశారు కృష్టంరాజు. మరి విషయమేమిటా అనుకుంటున్నారా? అయితే చదవండి..
రామతీర్థం విగ్రహ ధ్వంసం విచారణని సిఐడికి అప్పగించిన సంగతి తెలిసిందే. ప్రకటన వెలువడడం ఆలస్యం.. రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. క్రైస్తవ మతాన్ని అనుసరించే సిఐడి చిఫ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ సరైన తీరులో జరిగే అవకాశాలు లేవని, ప్రజలలో కూడా పలు అనుమానాలకు తావిచ్చినట్లు అవుతందనే సంచలన వ్యాఖ్యాలు చేశారు. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఆదేశాలను కూడా లెక్కచేయలేదని, అటువంటి వ్యక్తి చేతుల మీదగా దేవలయాల్లోని విగ్రహాలు ధ్వంసం చేసిన విచారణ చేయించడం ఏమాత్రం సబబు కాదని మీడియా వేదికగా అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Thanks to our Hon’ble Chief Minister Shri @ysjagan for transferring the case of attacks on temples from CBCID to a seperate 16 member SIT headed by Mr Ashok Kumar as requested. @AndhraPradeshCM
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) January 8, 2021
విమర్శలను సమాధానం చెప్పాలనుకున్నదో లేక లోపాయికరంగా ఏ వ్యవహారాలు జరిగాయో తెలియదుకానీ.. చివరకు ప్రభుత్వం విగ్రహాల ధ్వంసం కేసుపై సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనను రఘురామ కృష్ణంరాజు స్వాగతించినట్లు తెలుస్తుంది. తన అధికారక ట్విట్టర్ వేదికగా సిట్ ఏర్పాటుపై స్పందించారు. జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.
Must Read ;- అధికారులే మత ప్రచారకర్తలు.. విచారణా సారథులు!