జడ్జిలపై దూషణ కేసులో ప్రభుత్వ పాత్ర ఎంత!?
న్యాయమూర్తులను దూషించి, అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై నమోదైన కేసులు చివరికి జగన్ ప్రభుత్వం మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి! అయితే ఈ కేసులో వైసీపీ అభిమానులు, నేతలు, కార్యకర్తలు జగన్ పై ఉన్న ప్రేమతో జడ్జిలను దూషించి ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ ఈ కేసును సీబీఐ సీరియస్ గా తీసుకుని, లోతుగా విచారిస్తే.. అసలు నిజాలు నిగ్గుతేలుతున్నాయి. తీగ లాగితే ప్రభుత్వ డొంక కదులుతోంది! ఈ క్రమంలోనే కేసు మూలాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘డిజిటల్ కొర్పోరేషన్’ పాత్ర ఉందని సీబీఐ అనుమానాలను వ్యక్తం చేస్తోంది! న్యాయమూర్తులపై పెట్టిన పోస్టులకు సంబంధించిన మూలాలను ఆధారంగా వెతికితే.. డిజిటల్ కార్పోరేషన్ డొంక కదిలుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డిజిటల్ మీడియాకు చెందిన ఏడుగురు ఉద్యోగులను ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం! పోస్టులు అప్లోడ్ అయిన ఐపీ అడ్రసులను ఆధారంగా సీబీఐ విచారణను సాగించగా.. డిజిటల్ కార్పోరేషన్ లింకులు బయటకొచ్చినట్లు ప్రచారం ఊపందుకుంది!
డిజిట్ కార్పోరేషన్ ఎక్కడుంది.. దాని కథేమిటి?
జగన్ రెడ్డి ప్రభుత్వం సారధ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటైన ‘డిజిటల్ కార్పోరేషన్’ గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉంది. ఈ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరూ అంతపెద్ద కార్యాలయంలో ఏం చేస్తుంటారో అన్నది ఒక చిదంబర రహస్యం! జగన్ సలహాదారు ప్రశాంత్ కిశోర్ కు చెందిన ‘ఐ – ప్యాక్’ బృందంలోని కొందరు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. వీరికి నెలకు లక్షల్లో జీతాలిచ్చి పోషిస్తోంది ప్రభుత్వం! అధికారంలోకి లేనప్పుడు వీరికి జీతాలు వైసీపీనే ఇచ్చేది. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఖాతా నుంచి జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా ప్రభుత్వ కార్పోరేషన్ ద్వారా ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ.. వైసీపీ కోసం పని చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు! ఈ కోణంలోనే సీబీఐ విచారిస్తోంది. విచారణలో పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి, కేసును త్వరగా క్లోజ్ చేయాలని దూకుడుగా వ్యవహరిస్తోంది! ఈ నేపధ్యలోనే కేసు విచారణ స్పీడ్ ను పెంచింది! ఇప్పటికే పలువురని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం మున్సిపల్ కౌన్సిలర్ మారుతీ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మారుతీ రెడ్డి ఎమ్మెల్సీ ఇక్బాల్ ముఖ్య అనుచరుడు. ఢిల్లీ, బెంగులూరు చెందిన ఒక డీఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు మారుతీరెడ్డి ఇంటికి వెళ్ళి 12 గంటల పాటు విచారించారు. ఇంకోవైపు ప్రకాశం జిల్లాకు చెందిన మల్లిఖార్జున్ అనే వ్యక్తిని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Must Read:-జగన్, సజ్జల విమర్శలకు పవన్ కౌంటర్!











